ఆలు చీజ్ శాండ్ విచ్ | Alu cheese sandwich Recipe in Telugu

ద్వారా sravanthi komaravelli  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Alu cheese sandwich recipe in Telugu,ఆలు చీజ్ శాండ్ విచ్, sravanthi komaravelli
ఆలు చీజ్ శాండ్ విచ్by sravanthi komaravelli
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

ఆలు చీజ్ శాండ్ విచ్ వంటకం

ఆలు చీజ్ శాండ్ విచ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Alu cheese sandwich Recipe in Telugu )

 • బ్రౌన్ బ్రెడ్ 8 స్లైస్
 • ఉడికించిన బంగాళదుంపలు 5
 • తరిగిన ఉల్లిపాయ 1 పెద్దది
 • తిరిగిన కాప్సికం 1
 • కొత్తిమీర తరుగు 1 కట్ట
 • ఉప్పు తగినంత
 • కారం 1 స్పూను
 • జీలకర్ర పొడి 1/2 స్పూన్
 • గరం మసాలా 1/2 స్పూన్
 • ఆంచూర్ 1/4 స్పూన్
 • చీజ్ 5 స్లైసులు
 • మైయోనేజ్ 2 టేబుల్ స్పూన్
 • బటర్ 2 టేబుల్ స్పూన్

ఆలు చీజ్ శాండ్ విచ్ | How to make Alu cheese sandwich Recipe in Telugu

 1. బంగాళదుంపలను ఉడికించి పెట్టుకోవాలి
 2. బంగాళదుంపలను మెదిపి అందులో ఉల్లిపాయ ముక్కలు, కాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ఆంచూర్, గరం మసాలా పొడి వేయాలి. బాగా కలపాలి.
 3. ఆలు మిశ్రమం ఇలా ఉంటుంది.
 4. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మేయో రాసి ఆలు మిశ్రమం పెట్టి దాని పైన చీజ్ స్లైస్ పెట్టి, ఇప్పుడు మేయో రాసిన బ్రెడ్ పైన పెట్టుకోవాలి.
 5. ఇలా కావాల్సిన అన్ని చేసిన తర్వాత బటర్ వేసి గ్రిల్ చేసుకోవాలి. టొమాటో సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

నా చిట్కా:

చీజ్ స్లైస్ లేదా చీజ్ తురుము ఏదైనా వాడొచ్చు. గ్రిల్ లేదా పాన్ లో కూడా చేసుకోవచ్చు.

Reviews for Alu cheese sandwich Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo