రాజ్మా మసాల తో బట్టర్ నాన్ & చాకోలేట్ నాన్. (ఈస్ట్ లేని,ఓవెన్ లో లేకుండా) | Rajama masala with butter naan... n chocolate spread ....without yeast n oven. Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rajama masala with butter naan... n chocolate spread ....without yeast n oven. recipe in Telugu,రాజ్మా మసాల తో బట్టర్ నాన్ & చాకోలేట్ నాన్. (ఈస్ట్ లేని,ఓవెన్ లో లేకుండా), Swapna Sashikanth Tirumamidi
రాజ్మా మసాల తో బట్టర్ నాన్ & చాకోలేట్ నాన్. (ఈస్ట్ లేని,ఓవెన్ లో లేకుండా)by Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

రాజ్మా మసాల తో బట్టర్ నాన్ & చాకోలేట్ నాన్. (ఈస్ట్ లేని,ఓవెన్ లో లేకుండా) వంటకం

రాజ్మా మసాల తో బట్టర్ నాన్ & చాకోలేట్ నాన్. (ఈస్ట్ లేని,ఓవెన్ లో లేకుండా) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rajama masala with butter naan... n chocolate spread ....without yeast n oven. Recipe in Telugu )

 • రాత్రంతా నానపెట్టి ఉడికించిన రాజ్మా గింజలు250 గ్రామ్స్
 • సన్నగా తరిగిన టమాటా ముక్కలు200 గ్రామ్స్
 • సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు 200 గ్రామ్స్
 • బిర్యానీ ఆకులు 2
 • జీలకర్ర పొడి అర టీ స్పూన్
 • ధనియాలపొడి 1 టీ స్పూన్
 • గరం మసాలా అర టీ స్పూన్
 • పసుపు చిటికెడు
 • ఉప్పు 1 టీ స్పూన్
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
 • తరిగిన కొత్తిమీర అర కప్పు
 • కారం అర టీ స్పూన్
 • కరివేపాకు 1 రెమ్మ
 • పచ్చిమిర్చి(2) చీలికలు 4
 • ఆయిల్ పావు కప్పు
 • ఇప్పుడు నాన్ కి .....మైదా 2 కప్పులు
 • వంట సోడా పావు టీ స్పూన్
 • బేకింగ్ పొడి అర టీ స్పూన్
 • పంచదార 1 స్పూన్
 • ఉప్పు ముప్పావు స్పూన్
 • ఆయిల్ అరకప్పు
 • పెరుగు అరకప్పు
 • గోరువెచ్చని నీరు సుమారుగా 1 కప్
 • బటర్ అర కప్పు.
 • నూపప్పు 3 చెంచాలు.
 • సన్నగతరిగిన కొత్తిమీర 3 స్పూన్లు
 • న్యూటల్లా చాకోలేట్ క్రీమ్ 2 స్పూన్లు.

రాజ్మా మసాల తో బట్టర్ నాన్ & చాకోలేట్ నాన్. (ఈస్ట్ లేని,ఓవెన్ లో లేకుండా) | How to make Rajama masala with butter naan... n chocolate spread ....without yeast n oven. Recipe in Telugu

 1. ముందుగా మైదాను ఒక వెడల్పాటి బౌల్ లోకి తీసుకొని ఉప్పు,బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ ,పంచదార వేసి కలిపి ,2 స్పూన్ల ఆయిల్ ,పెరుగు వేసి కొద్దీ కొద్దిగా గోరువెచ్చని నీరు వేస్తూ ముద్దలా అయ్యేలా కలిపి... 7 ...8 నిమిషాలు బాగా మెదిపి ...కాస్త ఆయిల్ రాసి గట్టి మూత పెట్టి 1 గంట సేపు పక్కన ఉంచాలి.
 2. ఈ లోగా కూర కి మూకుడుపెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి అయ్యాక బిర్యానీ ఆకు,కరివేపాకు,పచ్చిమిర్చి వేసి వేయించి ఉల్లిపాయముక్కలు,కొద్దిగా ఉప్పు వేసి వేయించి,అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి..
 3. అవి వేగాక...జీలకర్ర పొడి,ధనియాల పొడి,పసుపు,గరం మసాలా పొడి,కారం వేసి వేయించాలి .
 4. అవన్నీ బాగా వేగాక టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాక 5....6 నిమిషాలు మూత పెట్టి వేయించాలి.
 5. ఇప్పుడు మెత్తగా ఉడికించిపెట్టుకున్న రాజ్మా ను వేసి,ఉప్పు వేసి, ఒక కప్ నీరు వేసి మూత పెట్టి 10 నిమిషాలు సన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి.
 6. నీరంతా కొద్దిగా ఇగిరి దగ్గర పడుతుంది.ఇప్పుడు సన్నగతరిగిన కొత్తిమీర చల్లి పొయ్యిమీద నుంచి దింపి రాజ్మా కూరను కాసరోల్ లోకి తీసుకోవాలి.ఇక్కడితో కూర రెడి అయింది కదా....ఇప్పుడు నాన్ సంగతి చూద్దాం.
 7. కలిపి పెట్టిన మైదా పిండి ముద్దను తీసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని మళ్ళీ 3 నిమిషాలు బాగా మెదిపి కావలసిన పరిమాణం లో ఉండలు చేసి పెట్టుకోవాలి.
 8. ఇప్పుడు పొయ్యి మీద పట్టుకోడానికి వీలుగా కాడ ఉన్న ఒక దళసరి ఇనుప పెనం గానీ......అల్యూమినియం పెనం పెట్టి 5 నిమిషాలు వేడిచెయ్యాలి...
 9. ఈలోగా ఒక పిండి ముద్దను తీసుకుని పొడి పిండి సాయంతో కాస్త మందం గా వత్తుకోవాలి ,(వత్తిన నాన్ ని ఒక చివర పట్టుకుని కొద్దిగా లాగితే కొలగా వుండే నాన్ ఆకారం వస్తుంది.)
 10. మంట తగ్గించి....చేతికి నీటి తడి చేసుకుని వత్తిన నాన్ పై మెల్లగా తడి రాసి....తడి ఉన్న భాగం పెనం మీద ఉండేలా జాగర్తగా వేసి ,పై భాగంలో కూడా కొద్దిగా తడి రాసి నూపప్పు చల్లాలి.
 11. ఇలా 5 నిమిషాలు సన్న మంట మీద కాలాక నాన్ అక్కడక్కడా బుడగలు వచ్చి పచ్చిదనం పోతుంది.
 12. అలా బుడగలు రాగానే నాన్ ని కదపకుండా...మొత్తం పెనాన్ని తిరగేసి మంట డైరెక్టుగా నాన్ కి తగిలేలా 5 అంగుళాలు ఎత్తు లో ఉంచి పట్టుకోవాలి....(తిరగేసిన పెనం మంట కి 5 అంగుళాలు ఎత్తులో ఉండాలి.)నాన్ పై ఉన్న బుడగలు బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు కాల్చాలి...
 13. ఇప్పడు పెనం మామూలు స్థితి లోకి పెట్టి అట్లకాడతో జాగర్తగా నాన్ ని తీసి ప్లేట్ లో పెట్టుకుని కొద్దిగా బటర్ రాసి కొత్తిమీర తరుగు అద్దుకోవాలి.
 14. బాక్స్ లో పెట్టేటప్పుడు పెద్ద నాన్ చేసి రెండుముక్కలుగా కట్ చేసి కూరతో ఒక ముక్క,,ఇంకో ముక్కకి న్యూటల్లా చాకోలేట్ క్రీమ్ రాసి నట్స్ పొడి చల్లి రోల్ చేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు...తోడుగా పళ్ళు పప్పులు సద్ది ఇస్తే...చక్కటి లంచ్ బాక్స్ ఇచ్చిన తృప్తి మన సొంతం.(న్యూటల్లా రాయలనుకున్నప్పుడు కొత్తిమీర అవసరం లేదు. లేదా ఒకటి అలా...ఒకటి ఇలాగా రెండు నాన్లు చేసుకుంటే....మొత్తం 4 ముక్కలు అవుతాయికదా..ఇద్దరికి ఒకేసారి బాక్సలు సద్దచ్చు.)

నా చిట్కా:

పిండి కలిపి పక్కన పెట్టుకున్నాక....కూరలు తరిగడం, రాజ్మా ఉడికించడం లాటిపనులు చేస్తే టైం ఆదా కాదా మరి. :blush:

Reviews for Rajama masala with butter naan... n chocolate spread ....without yeast n oven. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo