నువ్వుల కోఫ్తా బిరియాని | Sesame kofta biriyani Recipe in Telugu

ద్వారా Revathi Kumari  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sesame kofta biriyani recipe in Telugu,నువ్వుల కోఫ్తా బిరియాని, Revathi Kumari
నువ్వుల కోఫ్తా బిరియానిby Revathi Kumari
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

నువ్వుల కోఫ్తా బిరియాని వంటకం

నువ్వుల కోఫ్తా బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sesame kofta biriyani Recipe in Telugu )

 • 1 కప్ బాస్మతి బియ్యం
 • 1 బిరియాని ఆకు
 • 1 అంగుళం దాల్చిన చెక్క
 • 2-3 లవంగాలు
 • 2 ఇలాచీలు
 • 1 పెద్ద నల్ల ఇలాచీ
 • 2 జవిత్రి
 • 1 చెంచా ఉప్పు
 • 5 చెంచాలు నూనె
 • 2 చెంచాలు కొత్తిమీర
 • 1 చెంచా పుదీనా
 • గ్రేవీ తయారు చేసుకోవడానికి :-
 • 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగినది
 • 1 పెద్ద ఆలుగడ్డ తరిగినది
 • 1 కప్ కాలీఫ్లవర్ పువ్వులు
 • 1 కాప్సికం తరిగినది
 • 1 పెద్ద క్యారెట్ తరిగినది
 • 1/4 కప్ బీన్స్
 • 1/2 కప్ బఠాణి
 • 2 ఇంచ్ అల్లం
 • 4 వెల్లులి రెబ్బలు
 • 4 పచ్చిమిరపకాయలు
 • 1 చెంచా నల్ల జీలకర్ర
 • 1 బిరియాని ఆకు
 • 2-3 ఇలాచీ
 • 1 నల్ల ఇలాచీ
 • 1 అంగుళం దాల్చిన చెక్క
 • 4 లవంగాలు
 • 1 చెంచా కారం
 • 1/2 చెంచా పసుపు
 • 1 చెంచా ధనియాల పొడి
 • 2 చెంచాలు ఉప్పు
 • 1/4 కప్ బీట్ చేసిన పెరుగు
 • 10-12 కాజు
 • 2 చెంచాలు నెయ్యి
 • 5 బాదాం
 • మీల్ మేకర్ 1/2 కప్
 • పుదీనా 1 చెంచా
 • 1 చెంచా కొత్తిమీర
 • కోఫ్తా తయారు చేసుకోవడానికి :-
 • నువ్వులు 1/2 కప్
 • ఆలూ మాష్ చేసింది 1 కప్
 • ఉప్పు తగినంత
 • కారం తగినంత
 • పెరుగు 1/4 కప్
 • మైదా 1/4 కప్
 • అల్లం వెల్లులి పేస్ట్ 1/2 చెంచా
 • సూజి 1/4 కప్
 • అసెంబ్లింగ్:-
 • 1/3 కప్ పుదీనా ఆకులు
 • 1/3 కప్ కొత్తిమీర
 • 7-8 కుంకుమ పువ్వు
 • 2 చెంచాలు వేడి పాలు
 • 2 చెంచాలు గులాబీ నీళ్లు
 • 1 చెంచా గరం మసాలా
 • కీరా 1/8 కప్
 • క్యారెట్ 1/8 కప్

నువ్వుల కోఫ్తా బిరియాని | How to make Sesame kofta biriyani Recipe in Telugu

 1. ముందుగా బియ్యని 3-4 సార్లు కడుగుకోవాలి
 2. దానిని 1 కప్ నీళ్లలో 20 నిమిషాలు నానబెట్టుకోవాలి
 3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి ఉడికించాలి
 4. ఇప్పుడు అందులో బిరియాని ఆకు, దాల్చిన చెక్క, ఇలాచ,నల్ల ఇలాచీ, జాపత,ఉప్పు ,నూనె కొత్తిమీర ,పుదీనా ,వేసి ఉడికించాలి
 5. ఇప్పుడు అందులో బియ్యం వేసి 75% ఉడకనివ్వాలి
 6. బియ్యం ఉడికేలోపు బఠాణి ఉడికించాలి
 7. ఈలోపు ఉల్లిపాయ ,ఆలూ ,కాప్సికం ,బీన్స్ ,క్యారెట్ ,కాలీఫ్లవర్ ముక్కలు, కోసుకోవాలి
 8. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి వేడిచేయాలి
 9. నెయ్యి వేడి అయ్యిన తరువాత అందులో బిరియాని ఆకు ,దాల్చిన చెక్క ,ఇలాచీ, జీరా వేసివేయించాలి
 10. ఇప్పుడు అందులో సన్నగా తరిగినది ఉల్లిపాయ వేసి ఎర్రగా క్రిస్పీ గ అయ్యేవరకు వేయించాలి
 11. అందులో అల్లం వెల్లులి పేస్ట్ ,పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి
 12. అవి వేగిన తరువాత అందులో కారంపొడి ,పసుపు ,ధనియాల పొడి, ఉప్పు ,వేసుకోవాలి
 13. ఇప్పుడు అందులో తరిగిన కూరగాయముక్కలు వేసుకుని 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి
 14. అందులో మీల్ మేకర్ కూడా వేసుకోవాలి
 15. ఇప్పుడు అందులో పెరుగు కూడా వేసుకోవాలి
 16. వాటిని 10 నిమిషాలు ఉడికించుకోవాలి
 17. ఇప్పుడు కూరగాయలు ఉడికిన తరువాత అందులో కాజు ,బాదాం వేసి బాగా కలుపుని గ్రేవీ లా చేసుకోవాలి
 18. ఈలోపు మనం కోఫ్తాకి మైదా, సూజి ,పెరుగు, ఉప్పు ,కారం, ఆలూ, వేసి బాగా కలిపి చపాతి పిండిలా చేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని నూనెలో ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి
 19. ఇప్పుడు అమర్చటానికి ముందు కొత్తిమీర, పుదీనా తరుగుకోవాలి
 20. ఇపుడు గ్రేవీ ని 2 పార్ట్స్ గ డివైడ్ చేసుకోవాలి
 21. ముందుగా వెడల్పాటి గిన్నె లో కింద నెయ్యి రాసుకుని దాని మీద కూర వేసుకోవాలి దానిమీద తయారు చేసిన కోఫ్తా వేసుకోవాలి దానిమీద అన్నం వేసుకోవాలి
 22. దాని మీద తరిగిన కొత్తిమీర ,పుదీనా ,ఉల్లిపాయలు, కుంకుమపువ్వు, పాలు పోసుకుని ఆలా రెండు నుంచి మూడు లయెర్స్ ఇలా చేసుకోవాలి
 23. ఇప్పుడు దాని మీద అల్యూమినియం ఫాయిల్ వేసి మూత పెట్టి 10-15 నిమిషాలు దుం చేయాలి

Reviews for Sesame kofta biriyani Recipe in Telugu (0)