చింతపండు పులిహోర | Pulihora Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  13th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Pulihora by Chandrika Marripudi at BetterButter
చింతపండు పులిహోరby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

9

0

చింతపండు పులిహోర వంటకం

చింతపండు పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pulihora Recipe in Telugu )

  • ఉప్పు : తగినంత
  • పసుపు : 1 స్పూన్
  • కరివేపాకు : కొద్దిగా
  • ఎండుమిర్చి : 8
  • పచ్చిమిర్చి : 10
  • పల్లీలు : 5 టేబుల్ స్పూన్లు
  • సాయమినప్పప్పు : 4 టేబుల్ స్పూన్లు
  • పచ్చిశనగపప్పు : 5టేబుల్ స్పూన్లు
  • ఆవాలు : 3 టేబుల్ స్పూన్లు
  • నూనె : 100గ్రా
  • బియ్యం : 4 కప్పులు(రైస్ కుక్కర్ కప్)
  • చింతపండు :1/2కేజీ

చింతపండు పులిహోర | How to make Pulihora Recipe in Telugu

  1. చింతపండు నానపెట్టి చిక్కగా రసం తీసుకోవాలి.
  2. దానిలో తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
  3. చిక్కటి గుజ్జు అయేవరకు ఉడికించాలి
  4. బియ్యంని పొడి పొడిలాడేలా అన్నం వండుకోవాలి.
  5. ఒక వెడల్పాటి బేసిన్లో అన్నం వేసుకుని 2 స్పూన్ల కాచిన నూనె వేసి అన్నం అంతా కలిసేలా కలిపితే అఞటుకోకుండా విడి విడిగా వస్తుంది.
  6. ఇపుడు అన్నంలో చింతపండు గుజ్జు తగినంత వేసి అన్నం అంతా పట్టేలా కలుపుకోవాలి.
  7. ఇపుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడయ్యాక పచ్చి మిర్చి, ఎండుమిర్చి, పల్లీలు విడి విడిగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.
  8. తరువాత ఆవాలు, శనగ,మినప్పప్పు వేసి వేగాక కరివేపాకు వేసి 1 స్పూన్ పసుపు వేసి కలిపి ఈ పోపు మొత్తం అన్నంలో వేసి కలపాలి.
  9. ముందు వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి బాగా కలపాలి.
  10. చింతపండు గుజ్జు ఉడికించేటపుడు ఉప్పు వేస్తాం కాబట్టి సరిపోకపోతే పోపు కలిపేటపండు కొంచెం వేసుకుంటే సరి.చింతపండు పులిహోర రెడీ.

Reviews for Pulihora Recipe in Telugu (0)