హోమ్ / వంటకాలు / చింతపండు పులిహోర

Photo of Pulihora by Chandrika Marripudi at BetterButter
0
2
0(0)
0

చింతపండు పులిహోర

Sep-13-2018
Chandrika Marripudi
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు పులిహోర రెసిపీ గురించి

చితపండు పులిహోర పండుగలకి అందరూ చేసుకునే ఒక వంటకం.ఏదయినా ప్రయాణానికి,లంచ్ బాక్స్ లోకి అయినా తేలికగా పట్టుకెళ్ళొచ్చు.పెరుగుతో కూడా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. చింతపండు :1/2కేజీ
  2. బియ్యం : 4 కప్పులు(రైస్ కుక్కర్ కప్)
  3. నూనె : 100గ్రా
  4. ఆవాలు : 3 టేబుల్ స్పూన్లు
  5. పచ్చిశనగపప్పు : 5టేబుల్ స్పూన్లు
  6. సాయమినప్పప్పు : 4 టేబుల్ స్పూన్లు
  7. పల్లీలు : 5 టేబుల్ స్పూన్లు
  8. పచ్చిమిర్చి : 10
  9. ఎండుమిర్చి : 8
  10. కరివేపాకు : కొద్దిగా
  11. పసుపు : 1 స్పూన్
  12. ఉప్పు : తగినంత

సూచనలు

  1. చింతపండు నానపెట్టి చిక్కగా రసం తీసుకోవాలి.
  2. దానిలో తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
  3. చిక్కటి గుజ్జు అయేవరకు ఉడికించాలి
  4. బియ్యంని పొడి పొడిలాడేలా అన్నం వండుకోవాలి.
  5. ఒక వెడల్పాటి బేసిన్లో అన్నం వేసుకుని 2 స్పూన్ల కాచిన నూనె వేసి అన్నం అంతా కలిసేలా కలిపితే అఞటుకోకుండా విడి విడిగా వస్తుంది.
  6. ఇపుడు అన్నంలో చింతపండు గుజ్జు తగినంత వేసి అన్నం అంతా పట్టేలా కలుపుకోవాలి.
  7. ఇపుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడయ్యాక పచ్చి మిర్చి, ఎండుమిర్చి, పల్లీలు విడి విడిగా వేయించి ప్లేటులోకి తీసుకోవాలి.
  8. తరువాత ఆవాలు, శనగ,మినప్పప్పు వేసి వేగాక కరివేపాకు వేసి 1 స్పూన్ పసుపు వేసి కలిపి ఈ పోపు మొత్తం అన్నంలో వేసి కలపాలి.
  9. ముందు వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి బాగా కలపాలి.
  10. చింతపండు గుజ్జు ఉడికించేటపుడు ఉప్పు వేస్తాం కాబట్టి సరిపోకపోతే పోపు కలిపేటపండు కొంచెం వేసుకుంటే సరి.చింతపండు పులిహోర రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర