బ్రెడ్ ఉప్మా | Bread upma Recipe in Telugu

ద్వారా sravanthi komaravelli  |  16th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bread upma recipe in Telugu,బ్రెడ్ ఉప్మా, sravanthi komaravelli
బ్రెడ్ ఉప్మాby sravanthi komaravelli
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

10

1

బ్రెడ్ ఉప్మా వంటకం

బ్రెడ్ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bread upma Recipe in Telugu )

 • బ్రెడ్ ఒక పాకెట్
 • ఉల్లిపాయ- 1 పెద్దది
 • టొమాటోలు - 2
 • కాప్సికం - 1
 • ఉప్పు తగినంత
 • కారం 1 టీ స్పూన్
 • పసుపు పావు టీ స్పూన్
 • ఆవాలు 1/4 టీ స్పూన్
 • జీలకర్ర 1/4 టీ స్పూన్
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • కొత్తిమీర తరుగు
 • నూనె 3 టీ స్పూన్లు
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్

బ్రెడ్ ఉప్మా | How to make Bread upma Recipe in Telugu

 1. బ్రెడ్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 2. ఉల్లిపాయ, టొమాటో, కాప్సికం ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 3. ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి.
 4. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
 5. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
 6. టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
 7. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలియబెట్టాలి
 8. కాప్సికం ముక్కలు వేసి రెండు స్పూన్ల నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
 9. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. కొత్తిమీర తరుగు వేయాలి. రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. బ్రెడ్ ఉప్మా రెడీ.

నా చిట్కా:

నేను బ్రౌన్ బ్రెడ్ వాడాను. మీరు మీకు నచ్చిన బ్రెడ్ వాడొచ్చు.

Reviews for Bread upma Recipe in Telugu (1)

Sharvani Gundapanthulaa month ago

జవాబు వ్రాయండి