దిబ్బరొట్టి | DIBBAROTTE Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  16th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • DIBBAROTTE recipe in Telugu,దిబ్బరొట్టి, Kavitha Perumareddy
దిబ్బరొట్టిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

దిబ్బరొట్టి వంటకం

దిబ్బరొట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DIBBAROTTE Recipe in Telugu )

 • ముందురోజు తయారు చేసుకున్న ఇడ్లి పిండి ఒక కప్
 • నూనె సరిపడినంత .
 • ఉప్పు తగినంత
 • ఇడ్లి పిండి కోసం : 1 కప్ : మినపప్పు 2.5 కప్పులు : ఇడ్లి రవ్వ

దిబ్బరొట్టి | How to make DIBBAROTTE Recipe in Telugu

 1. ఇడ్లి పిండిలో ఉప్పు వేసి గరిటతో బాగా కలపాలి ... ఎంత బాగా కలిపితే దిబ్బరొట్టి అంత మెత్తగా వస్తుంది.
 2. ఇప్పుడు పోయిమీద పెనం పెట్టి స్పున్ నూనెవేసి 3 గరిటలు పిండి వేసుకోవాలి .పిండిని అలాగే ఉంచాలి .గరిటతో తిప్పకూడదు దోసెలాగా తిప్పకూడదు ...అలాగే నెమ్మదిగా పిండి సర్దుకుంటుంది.
 3. ఇప్పుడు పిండి వేసిన తరువాత పెనం మీద మూత పెట్టి చిన్న మంట మీద 5 నిముసాలు అలాగే ఉంచాలి.
 4. ఇప్పుడు మూత తీసి చూస్తే దిబ్బరొట్టి బాగా పొంగి ఉంటుంది.ఇప్పుడు రొట్టి పైన ,చుట్టూరు కొద్దిగా నూనె వేసి తిప్పివేయాలి.ఇప్పుడు మూత అవసరం లేదు.ఒక 5 నిముసాలు ఉంచి తీసేస్తే సరిపోతుంది .
 5. ఇంకా నచ్చిన ఆకారంలో కట్ చేసి లంచ్ బాక్స్ లో సర్ది ఇస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. :blush: :ok_hand:

నా చిట్కా:

ఇడ్లి పిండి కొద్దిగా పులిస్తేనే దిబ్బరొట్టి రుచిగా ఉంటుంది.

Reviews for DIBBAROTTE Recipe in Telugu (0)