కొర్రల పొంగల్. | Millet pongal. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  17th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Millet pongal. by దూసి గీత at BetterButter
కొర్రల పొంగల్.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

కొర్రల పొంగల్. వంటకం

కొర్రల పొంగల్. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Millet pongal. Recipe in Telugu )

 • జీడిపప్పు : 10 పలుకులు‌
 • నెయ్యి : 2 చెంచాలు.
 • ఉప్పు : 1/4 చెంచా.
 • కరివేపాకు : రెండు రెమ్మలు.
 • జీలకర్ర : 1/4 చెంచా.
 • మిరియాలు : 5 నుండీ 10 వరకూ.
 • అల్లం తురుము : 1/4 చెంచా.
 • పచ్చిమిర్చి : 2
 • ఎండుమిర్చి : 1
 • పెసరపప్పు 1/2 కప్పు.
 • కొర్రలు: 1 కప్పు.

కొర్రల పొంగల్. | How to make Millet pongal. Recipe in Telugu

 1. శుభ్రం చేసిన కొర్రలూ, పెసరపప్పు కలిపి కుక్కర్లో 3 విజిల్స్ వరకూ ఉడికించాలి
 2. మూకుడు లో నెయ్యి వేసి కాగాక, ఎండుమిర్చి,మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకులతో పోపు వేయించుకోవాలి.
 3. ఉడికిన కొర్రలు మిశ్రమాన్ని అందులో వేసి చిటికెడు పసుపు, ఉప్పు కూడా వేసి అర గ్లాసు నీళ్ళు పోసి 5 నిమిషాలు ఉడికించాలి.
 4. ఈ సమయంలో ఇష్టమైతే చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.
 5. చివరిగా వేయించిన జీడిపలుకులు నెయ్యి వేసి దించేయాలి.

నా చిట్కా:

పొంగల్ కాస్త పల్చన గానే ఉంచాలి. లేకపోతే చల్లారేక గట్టిగా ముద్దలా అయిపోతుంది.

Reviews for Millet pongal. Recipe in Telugu (0)