హోమ్ / వంటకాలు / రోటి విత్ బేబీ కార్న్ మసాలా

Photo of Roti with baby corn masala by Sree Sadhu at BetterButter
759
3
0.0(0)
0

రోటి విత్ బేబీ కార్న్ మసాలా

Sep-17-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోటి విత్ బేబీ కార్న్ మసాలా రెసిపీ గురించి

ఇది చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్ లో పెడితే ఎంజాయ్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. గోధుమపిండి 3 కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. పంచదార 1/2 చెంచా
  4. నీళ్లు తగినంత
  5. తరిగిన బేబీ కార్న్ 1 కప్
  6. తరిగిన క్యారెట్ 1 కప్
  7. తరిగిన బంగాళదుంప 1 కప్
  8. ఉల్లిపాయ 2
  9. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  10. ఉప్పు తగినంత
  11. కారం తగినంత
  12. గరం మసాలా 2 చెంచాలు
  13. నూనె 2 చెంచాలు
  14. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి ఉప్పు పంచదార, నీళ్లు, పోసి చపాతి పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడిఅయ్యిన తరువాత ఉల్లిపాయ, టమాటో ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి
  3. వేగిన తరువాత మిక్సీ జార్ లోకి తీసుకుని నీళ్లు పోసుకుని పేస్టచేయాలి
  4. ఇప్పుడు మళ్ళి బాండి పెట్టి అందులో నూనె వేసి ఈ పేస్ట్ వేసి మూకుడుకి అంటుకోకుండా ఉండే వరకు వేయించాలి
  5. అప్పుడు అందులో ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేయించి నీళ్లు పోసుకుని తరిగిన కూరగాయ ముక్కలు వేసి బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే
  6. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకుని బాల్స్ చేసుకోవాలి
  7. వాటిని వత్తి పెనం పై వేసి రెండు వైపులా కలిచుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర