స్పాంజ్ దోశ | Sponj dosa Recipe in Telugu

ద్వారా Gayathri Srinivas  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Sponj dosa recipe in Telugu,స్పాంజ్ దోశ, Gayathri Srinivas
స్పాంజ్ దోశby Gayathri Srinivas
 • తయారీకి సమయం

  8

  గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

స్పాంజ్ దోశ వంటకం

స్పాంజ్ దోశ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sponj dosa Recipe in Telugu )

 • స్పాంజ్ దోశ 100 grams
 • ఉప్పుడు బియ్యం 200 grams
 • దంపుడు అటుకులు 100 grams
 • మెంతులు 1 table spoon
 • ఉప్పు తగినంత
 • నూనె దోశలు కాల్చుకోవడానికి సరిపడా

స్పాంజ్ దోశ | How to make Sponj dosa Recipe in Telugu

 1. మినప గుళ్ళు ఉప్పుడు బియ్యం అందులో మెంతులు వేసి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి
 2. నానిన మినపగుళ్ళు బియ్యము కడుగుకొని పక్కన పెట్టుకోవాలి
 3. పిండిని గ్రైండ్ చేసుకోవడానికి 15 నిమిషాలు ముందుగా అటుకులను కడిగి నానబెట్టుకోవాలి
 4. ఇప్పుడు నానిన అటుకులు మినప గుళ్ళు బియ్యం మెంతులు కలిపి గ్రైండ్ చేసుకున్న వలెను పిండి దోశ పిండిలా జారుగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండవలెను
 5. గ్రైండ్ చేసిన పిండిని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ పక్కన పెట్టవలెను
 6. పిండిలో తగినంత ఉప్పు చేర్చి బాగా కలుపుకొని రెడీగా ఉంచుకొనవలెను
 7. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పాన్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొనవలెను
 8. దిబ్బ రొట్టె వలె పిండి కొంచెం మందంగా వేసుకుని మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి
 9. దోశను రెండో వైపు కూడా కాల్చుకుని పక్కన పెట్టవలెను అన్ని వేసుకుని ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవాలి

నా చిట్కా:

సాల్ట్ ని దోసెలు వేసుకునే ముందు వేసుకుంటే పిండి పులవకుండా టేస్టీగా ఉంటుంది

Reviews for Sponj dosa Recipe in Telugu (0)