దబ్బకాయ పులిహోర | Citrus yellow rice Recipe in Telugu

ద్వారా NAGALAXMI YALLAMBHATLA  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Citrus yellow rice recipe in Telugu,దబ్బకాయ పులిహోర, NAGALAXMI YALLAMBHATLA
దబ్బకాయ పులిహోరby NAGALAXMI YALLAMBHATLA
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

దబ్బకాయ పులిహోర వంటకం

దబ్బకాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Citrus yellow rice Recipe in Telugu )

 • బియ్యం 1 గ్లాసు
 • నూనె 50 మి.ల్లీ.
 • దబ్బకాయ ఓకటి రసం తీసి పెట్టుకోవాలి
 • శనగపప్పు 1 టేబుల్ స్పూన్
 • మినపప్పు 1 టేబుల్ స్పూన్
 • పల్లీలు 2 టేబుల్ స్పూన్లు
 • ఆవాలు 1 టేబుల్ స్పూన్
 • జీలకర్ర 1/2టేబుల్ స్పూన్
 • కరివేపాకు 2 రెమ్మలు
 • ఇంగువ 1/2టేబుల్ స్పూన్
 • 6 పచ్చిమిరపకాయలు
 • ఉప్పు 1 1/2టేబుల్ స్పూన్
 • పసుపు 1/2టేబుల్ స్పూన్
 • 5 ఎండుమిరపకాయలు

దబ్బకాయ పులిహోర | How to make Citrus yellow rice Recipe in Telugu

 1. ముందుగా బియ్యం కడిగి అన్నం వండి చల్లార్చాలి .
 2. తరవాత దబ్బకాయ రసం అన్నంలో కలిపి ఉప్పు ,పసుపు వేసుకుని కలపాలి.
 3. ఇప్పుడు పాన్ లో నానె వేసి వేడెక్కిన తరవాత శనగపప్పు ,మినపప్పు ,పల్లీలు ,ఆవాలు ,జీలకర్ర వేయాలి వేగిన తరవాత ఎండుమిర్చి ,పచ్చిమిరపకాయలు ,కరేపాకు ,ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి
 4. పోపు ని చల్లార్చుకున్న అన్నం లో కలపి మెత్తం అంతా కలిసేటట్టు కలపాలి అంతే.

నా చిట్కా:

ఓక గాజు గ్లాసులో గళ్లఉప్పు వేసి చాకులు ,పీలర్లు వేసి పెడితే పదును అవుతాయి .

Reviews for Citrus yellow rice Recipe in Telugu (0)