పప్పు పరొటా | Dal Paratha Recipe in Telugu

ద్వారా Sridevi Vedantham  |  18th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dal Paratha recipe in Telugu,పప్పు పరొటా, Sridevi Vedantham
పప్పు పరొటాby Sridevi Vedantham
  • తయారీకి సమయం

    45

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పప్పు పరొటా వంటకం

పప్పు పరొటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal Paratha Recipe in Telugu )

  • సెనగపప్పు - 250 gms
  • వాటర్ తగినంత
  • ఉప్పు - రుచికి తగినంత
  • గోధుమ పిండి - 1/2 కేజీ
  • చాట్ మసాలా - 1/2 టేబుల్ స్పూన్
  • గరం మసాలా - 1/2 టేబుల్ స్పూన్
  • కసూరీ మేథి - 1 టేబుల్ స్పూన్
  • కారం - 1/2 టేబుల్ స్పూన్
  • నెయ్యి - తగినంత
  • నూనె - తగినంత

పప్పు పరొటా | How to make Dal Paratha Recipe in Telugu

  1. ముందుకే గోధుమ పిండిలో కొద్దిగ నూనె , ఉప్పు వేసి నీళ్ళు పోసి బాగా చపాతీ పిండి లా కలుపుకోవాలి. అరగంట నాననివ్వాలి.
  2. శెనగపప్పు తగినంత నీరు పోసి స్టవ్ పై పెట్టి 3 వంతులు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  3. ఉడికించిన శెనగపప్పు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, కసూరీ మేథి వేసి బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు చపాతీ పిండి ఉండలు చేసి, ఒక్కొక్క ఉండ తీసుకొని, కొద్దిగ గుంట చేసి శెనగపప్పు మిశ్రమం 2 స్పూన్ వేసి పిండి ని మళ్ళీ ఉండాలా చేసి పల్చగా చపాతీ ల వత్తుకొని పెనం పై వేసి నెయ్యి వేసి కాల్చుకోవాలి.

నా చిట్కా:

పిండి ఎంత బాగా కలిపితే పరొటా అంత మెత్తగా వస్తుంది

Reviews for Dal Paratha Recipe in Telugu (0)