Photo of coconut  rice by Kavitha Perumareddy at BetterButter
494
6
0.0(0)
0

coconut rice

Sep-19-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. పావుకేజీ బియ్యంతో చేసుకున్న అన్నం.పొడిగా ఉండాలి.
  2. కొబ్బరి ఒక చిప్ప
  3. పచ్చిమిర్చి 6
  4. పోపుగింజెలు స్పున్
  5. జీడిపప్పు 10 గ్రామ్స్
  6. వేరుశనగ పప్పులు 2 స్పూన్స్
  7. కొత్తిమీర గుప్పెడు
  8. కరివేపాకు 2 రెమ్మలు
  9. నూనె 2 స్పూన్స్
  10. ఉప్పు తగినంత
  11. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా కొబ్బరి ,3 పచ్చిమిర్చి మిక్షిలో వేసి కొబ్బరి పొడిలా చేసుకోవాలి.నీరు వేయకూడదు.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజేలు,వేరుశెనగ గుళ్ళు,జీడిపప్పు, ఎండుమిర్చి వేసి వేగిన తరువాత 3 పచ్చిమిర్చి ముక్కలు,కరేపాకు వేసుకొని వేపుకోవాలి.కొత్తిమీర కూడా కొద్దిగా వేసి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు వేగిన పోపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసుకోవాలి.తగినంత ఉప్పు కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. 5 నిముసాలు కొబ్బరిని మగ్గించాలి.
  4. ఇప్పుడు మగ్గిన కొబ్బరి మిశ్రమంలో అన్నం వేసి అంతా కలిపి ఒక 5 నిముసాలు ఉంచాలి.ఇప్పుడు కొబ్బరి అన్నంలో నిమ్మకాయ రసం మిగిలిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  5. ఇంకా వేడి వేడిగా కొబ్బరి అన్నం రెడీ ఐపోయింది.లంచ్ బాక్స్ లో సర్దుకోవడమే. దీనికి సైడ్ డిష్ ఏమి లేకపోయినా ఉట్టిగానే బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర