పరాఠ విత్ ఆలూ కుర్మా | Roti with aloo kurma Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Roti with aloo kurma recipe in Telugu,పరాఠ విత్ ఆలూ కుర్మా, Sree Vaishnavi
పరాఠ విత్ ఆలూ కుర్మాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    23

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పరాఠ విత్ ఆలూ కుర్మా వంటకం

పరాఠ విత్ ఆలూ కుర్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Roti with aloo kurma Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • నీళ్లు 1/2 కప్
  • ఉప్పు 1 చెంచా
  • నూనె 1 చెంచా
  • 7-8 ఎండుమిరపకాయలు
  • 1.5 చెంచా ధనియాలు
  • 2 చెంచాలు గసగసాలు
  • 1/2 చెంచా జీలకర్ర
  • 3 ఆలూగడ్డ లు
  • 2 చెంచాలు నూనె
  • 2 లవంగాలు
  • 2 ఇలాచీ
  • 1 అంగుళం దాల్చినచెక్క
  • 1 ఉల్లిపాయ
  • 1 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  • 4 చెంచాలు పెరుగు
  • 1 కప్ నీళ్లు
  • 3/4 కప్ కొబ్బరి పాలు
  • 8 -10 కాజు
  • ఉప్పు తగినంత
  • గరం మసాలా

పరాఠ విత్ ఆలూ కుర్మా | How to make Roti with aloo kurma Recipe in Telugu

  1. ముందుగా ఉప్పు, మైదా పిండి ,నూనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  2. అందులో తగినంత నీళ్లు పోసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలి
  3. దానిని కాసేపు పక్కన ఉంచాలి
  4. తరువాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి దానిని వేడి చేయాలి
  5. అది వేడి అయ్యేలోపు ఈ పిండిని తీసుకుని బాగా పల్చగా వత్తి పెనం పై వేసుకుని రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి
  6. ముందుగా ధనియాలు జీలకర్ర ,ఎండుమిరపకాయలు, గసగసాలు, నూనె లేకుండా మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి
  7. దానిని మెత్తటి పౌడర్ చేసుకోవాలి
  8. ఆ పౌడర్ ని 4 చెంచాలు పెరుగు లో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  9. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక దాల్చినచెక్క, ఇలాచీ, అన్ని వేసి వేయించి అందులో అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  10. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయా వేసి వేయించాలి
  11. అది వేగాక అందులో ఆలూ వేసి వేగనివ్వాలి
  12. వేగినతరువాత అందులో తగినంత ఉప్పు, కారం, పెరుగు మిశ్రమం వేసి బాగా కలిపి నూనె తేలే వరకు ఉంచాలి అంతే

Reviews for Roti with aloo kurma Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo