మిక్స్డ్ వెజ్ పరోటా. | Mixed veg parotha. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed veg  parotha. recipe in Telugu,మిక్స్డ్ వెజ్  పరోటా., దూసి గీత
మిక్స్డ్ వెజ్ పరోటా.by దూసి గీత
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మిక్స్డ్ వెజ్ పరోటా. వంటకం

మిక్స్డ్ వెజ్ పరోటా. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed veg parotha. Recipe in Telugu )

  • ఉడికించిన ఆలూ : 4 :
  • కేరట్ తురుము : 1/2 కప్పు.
  • పచ్చిబఠాణీ : 1/2 కప్పు.
  • పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ : 1/2 చెంచా.
  • ఆమ్చూర్ పౌడర్ : 1/4 చెంచా.
  • ఉప్పు : 1/2 చెంచా.
  • కొత్తిమీర : 1 కట్ట .
  • కారం : 1/2 చెంచా.
  • గోధుమ పిండి : 2 కప్పులు.
  • నెయ్యి/ బటర్ : 1/4 కప్పు.

మిక్స్డ్ వెజ్ పరోటా. | How to make Mixed veg parotha. Recipe in Telugu

  1. గోధుమపిండి చపాతీ పిండిలా కలిపి ఉంచుకోవాలి.
  2. ఆలూ ఉడికించి తురిమి, అందులో కేరట్ తురుము , ఉడికించి మెదిపిన పచ్చి బఠాణి , ఉప్పు, కారం, ఆంచూర్ పౌడర్ , అల్లం పచ్చిమిర్చి పేస్ట్ , సన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్ని వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టాలి .
  3. కలుపుకున్న గోధుమ పిండి ని పెద్ద నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి .
  4. ఆలూ మిశ్రమం కూడా అదే సైజ్ లో ఉండలు చేసి పెట్టుకోవాలి.
  5. గోధుమపిండి తో అంచులు కాస్త పలుచగా మధ్య లో దళసరిగా ఉండేలా కొంచెం ఒత్తుకుని, అందులో ఆలూ మిశ్రమం తో చేసిన ఉండ పెట్టి అన్ని వైపులా నుండీ కవర్ చేస్తూ జాగ్రత్త గా మూసేయాలి.
  6. ఇలా చేసుకున్న దానిని సున్నితంగా పరోటా ఒత్తుకోవాలి.
  7. అన్నీ ఇలా పరోటా చేసుకున్న తర్వాత పెనం పై రెండువైపులా బంగారు రంగు వచ్చేలా కాల్చుకొని నెయ్యి/ బటర్ రాసుకోవాలి.అంతే.

Reviews for Mixed veg parotha. Recipe in Telugu (0)