పులిహోర. | Tamarind rice. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tamarind rice. recipe in Telugu,పులిహోర., దూసి గీత
పులిహోర.by దూసి గీత
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పులిహోర. వంటకం

పులిహోర. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamarind rice. Recipe in Telugu )

  • బియ్యం : 1 కప్పు.
  • చింతపండు : పెద్ద నిమ్మకాయంత.
  • శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు, మెంతులు,ఇంగువ చిటికెడు. అన్నీ కలిపి 2 చెంచాలు.
  • వేరుశనగ పలుకులు : 1/4 కప్పు.
  • ఎండుమిర్చి : 5.
  • పచ్చిమిర్చి : 6
  • అల్లం : చిన్నముక్క.
  • కరివేపాకు : రెండురెమ్మలు.
  • నూనె : 4 చెంచాలు.
  • బెల్లం : చాలా చిన్న ముక్క.
  • ఉప్పు: రెండు చెంచాలు.
  • పసుపు : 1/4 చెంచా.

పులిహోర. | How to make Tamarind rice. Recipe in Telugu

  1. ముందుగా అన్నం వండుకుని పళ్ళెం లో పోసి, పసుపు,ఉప్పు వేసి కలిపి చల్లార్చుకోవాలి.
  2. చింతపండు నానపెట్టి గుజ్జు తీసి ఉంచాలి.
  3. మూకుడు లో నూనె వేడెక్కాక, ముందు వేరుశనగ పలుకులు వేసి ,అవి వేగాక, మిగిలిన పోపు సామాన్లన్నీ ఒక్కొక్కటిగా వెయ్యాలి. అన్నీ వేగాక , పచ్చిమిర్చి లో సగమూ, కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత అన్నీ కూడా అన్నంలో వేసి బాగా కలపాలి.
  4. చింతపండు గుజ్జు ఉడికించి అన్నం లో కలపాలి.
  5. మిగిలిన పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ చేసి అదికూడా అందులో వేసి బాగా కలపాలి. అంతే ఘుమఘుమలాడే పులిహోర సిద్ధం .

Reviews for Tamarind rice. Recipe in Telugu (0)