మష్రూమ్ పనీర్ మసాలా రోటితో | Mashrum paneer masala with roti Recipe in Telugu

ద్వారా Uma Ram  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mashrum paneer masala with roti recipe in Telugu,మష్రూమ్ పనీర్ మసాలా రోటితో, Uma Ram
మష్రూమ్ పనీర్ మసాలా రోటితోby Uma Ram
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

మష్రూమ్ పనీర్ మసాలా రోటితో వంటకం

మష్రూమ్ పనీర్ మసాలా రోటితో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mashrum paneer masala with roti Recipe in Telugu )

 • మసాలా పేస్ట్ కొరకు:
 • నూనె - 2 టేబుల్ స్పూన్లు
 • ఉల్లిముక్కలు - 1 కప్పు
 • టొమాటో ముక్కలు - 3/4 కప్పు
 • అల్లం ముక్కలు - 1 టీ స్పూను
 • వెల్లుల్లి ముక్కలు - 1 టీ స్పూన్
 • జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
 • పనీర్ మష్రూమ్ మసాలా తయారీకి:
 • నూనె - 1 టేబుల్ స్పూన్
 • బిర్యానీ ఆకు - చిన్నది
 • షాజీరా లేక జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
 • మష్రూమ్స్ - 200 గ్రాములు
 • మిర్చి పౌడర్ - 1/4 టీ స్పూన్
 • మిరియాల పొడి - 1/4 టీ స్పూన్
 • కసూరి మేథీ - 1/4 స్పూను
 • పనీర్ - 200 గ్రాములు
 • ఉప్పు - తగినంత
 • పసుపు - చిటికెడు

మష్రూమ్ పనీర్ మసాలా రోటితో | How to make Mashrum paneer masala with roti Recipe in Telugu

 1. బాణలి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక 2 టేబుల్ సూన్ల నూనె వేయాలి.
 2. నూనె కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
 3. ఉల్లిముక్కలు వేగాక వరుసగా అల్లం,వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
 4. వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి.తరువాత దానిలోనే జీడిపప్పు వేసి వేయించాలి.
 5. ఇది చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.
 6. వేరొక బాణలిలో నూనె వేసి వేడయ్యాక షాజీరా లేక జీలకర్ర వేసి వేయించాలి. వేగాక బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
 7. దానిలో కడిగి కట్ చేసి పెట్టుకొన్న మష్రూమ్ ముక్కలు వేసి ఉప్పు, పాసు వేసి మూత పెట్టాలి.
 8. మష్రూమ్ ముక్కలు వేగాక మిర్చి పౌడర్ కసూరి మేథీ వెయ్యాలి.
 9. దానిలో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి అవసరమైతే 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వెయ్యాలి.
 10. కొంచెం మగ్గాక కట్ చేసుకొన్న పనీర్ క్యూబ్స్ వెయ్యాలి. ఒక 5 నిమిషాలు మగ్గాక దించుకుని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

Reviews for Mashrum paneer masala with roti Recipe in Telugu (0)