సాంబార్ అన్నం | SAAMBAAR rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • SAAMBAAR rice recipe in Telugu,సాంబార్ అన్నం, Kavitha Perumareddy
సాంబార్ అన్నంby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

సాంబార్ అన్నం వంటకం

సాంబార్ అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SAAMBAAR rice Recipe in Telugu )

  • బియ్యము పావుకేజీ
  • కందిపప్పు 150 గ్రామ్స్ .ఒక చిన్న గ్లాస్ అంత
  • చింతపండు నిమ్మకాయ సైజు
  • టమాటాలు 2
  • పచ్చిమిర్చి 3
  • ఉల్లిగడ్డ 1
  • బంగాళాదుంప 1
  • క్యారెట్ 1
  • బీన్స్ 3
  • దొండకాయలు 4
  • వంకాయ 1
  • పసుపు సగం స్పున్
  • ఉప్పు తగినంత
  • నూనె 2 స్పూన్స్
  • పోపుగింజెలు 1 స్పున్
  • ఎండుమిర్చి 2
  • ఇంగువ పావు స్పున్
  • కరివేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర గుప్పెడు.ఒక చిన్న కట్ట.
  • సాంబార్ మసాలకు కావాల్సిన పదార్థాలు ...
  • సెనగపప్పు 2 స్పూన్స్
  • మినపప్పు 2 స్పూన్స్
  • ధనియాలు 1 స్పున్
  • జీలకర్ర 1స్పున్
  • దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క
  • లవంగాలు 3
  • మరాఠీ మొగ్గ 1
  • కొబ్బరి పొడి 2 స్పూన్స్
  • ఎండుమిర్చి 6
  • మిరియాలు 10

సాంబార్ అన్నం | How to make SAAMBAAR rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యము కడిగి నానబెట్టుకోవాలి.చిన్న గిన్నెలో చింతపండు కూడా నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి మసాలా దినుసులు,ఎండుమిర్చి, కొబ్బరి.. నూనె లేకుండా వేయించి చల్లారాక మిక్షిలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి.
  3. తరువాత కందిపప్పు ను కొద్దిగా పసుపు ,కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించి ఎనుపుకొని పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజె లు ,ఎండుమిర్చి ,కరివేపాకు కొద్దిగా వేసుకొని పోపు వేపుకోవాలి.ఈ పోపులో ఇంగువ కూడా వేసుకోవాలి.తరువాత ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మగ్గిన తరువాత మిగతా కూరగాయలు ,కొద్దిగా పసుపు వేసి కలిపి 5 నిముసాలు మగ్గించాలి.
  5. కూరగాయలు మగ్గిన తరువాత ఉడికించిన కందిపప్పు ,చింతపండు రసం వేసి కలుపుకోవాలి .రెడీ చేసుకున్న మసాలా కూడా వేసి కలుపుకోవాలి.తరువాత తగినంత నీళ్లు,ఉప్పు వేసుకొని సాంబార్ ను మరిగించాలి. ఒక గ్లాస్ బియ్యము ఐతే 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి.అప్పుడే అన్నము ,కూరగాయలు బాగా ఉడుకుతాయి.
  6. ఇప్పుడు సాంబార్ మరిగిన తరువాత నానబెట్టిన బియ్యము వేసి కలిపి ఉడికించాలి.మూడు భాగాలు ఉడికిన తరువాత మంట తగ్గించి చిన్న మంట మీద ఉడికించాలి.
  7. అన్నము కొద్దిగా లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసివేయాలి.కొత్తిమీర .,కరివేపాకు వేసి కలుపుకోవడమే ఇంకా.
  8. కొత్తిమీర తో అలంకరించి వడ్డించుకోవడమే ఇంకా వేడి వేడిగా ... :relaxed:

నా చిట్కా:

మసాలా దినుసులు చిన్న మంటమీద వేయించుకోవాలి. అప్పుడే మంచి సువాసన వస్తుంది.

Reviews for SAAMBAAR rice Recipe in Telugu (0)