హోమ్ / వంటకాలు / సాంబార్ అన్నం

Photo of SAAMBAAR rice by Kavitha Perumareddy at BetterButter
589
2
0.0(0)
0

సాంబార్ అన్నం

Sep-19-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాంబార్ అన్నం రెసిపీ గురించి

అన్నము సాంబార్ తో కలిపి ఉడికిస్తాము.అందుకని చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లో అన్నం ఒక గిన్నెలో సాంబార్ ఒకాగిన్నెలో పెట్టుకొని వెళ్ళాలి అంటే ఇబ్బంది .అందుకే ఇలా కలిపి వండితే ఈజీగా ఉంటుంది తీసుకెళ్లడానికి.ఇంకా కూరగాయలు అన్ని కలిపి చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యము పావుకేజీ
  2. కందిపప్పు 150 గ్రామ్స్ .ఒక చిన్న గ్లాస్ అంత
  3. చింతపండు నిమ్మకాయ సైజు
  4. టమాటాలు 2
  5. పచ్చిమిర్చి 3
  6. ఉల్లిగడ్డ 1
  7. బంగాళాదుంప 1
  8. క్యారెట్ 1
  9. బీన్స్ 3
  10. దొండకాయలు 4
  11. వంకాయ 1
  12. పసుపు సగం స్పున్
  13. ఉప్పు తగినంత
  14. నూనె 2 స్పూన్స్
  15. పోపుగింజెలు 1 స్పున్
  16. ఎండుమిర్చి 2
  17. ఇంగువ పావు స్పున్
  18. కరివేపాకు 2 రెమ్మలు
  19. కొత్తిమీర గుప్పెడు.ఒక చిన్న కట్ట.
  20. సాంబార్ మసాలకు కావాల్సిన పదార్థాలు ...
  21. సెనగపప్పు 2 స్పూన్స్
  22. మినపప్పు 2 స్పూన్స్
  23. ధనియాలు 1 స్పున్
  24. జీలకర్ర 1స్పున్
  25. దాల్చిన చెక్క ఒక అంగుళం ముక్క
  26. లవంగాలు 3
  27. మరాఠీ మొగ్గ 1
  28. కొబ్బరి పొడి 2 స్పూన్స్
  29. ఎండుమిర్చి 6
  30. మిరియాలు 10

సూచనలు

  1. ముందుగా బియ్యము కడిగి నానబెట్టుకోవాలి.చిన్న గిన్నెలో చింతపండు కూడా నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి మసాలా దినుసులు,ఎండుమిర్చి, కొబ్బరి.. నూనె లేకుండా వేయించి చల్లారాక మిక్షిలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి.
  3. తరువాత కందిపప్పు ను కొద్దిగా పసుపు ,కొంచెం నూనె వేసి మెత్తగా ఉడికించి ఎనుపుకొని పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసి వేడిచేసి పోపుగింజె లు ,ఎండుమిర్చి ,కరివేపాకు కొద్దిగా వేసుకొని పోపు వేపుకోవాలి.ఈ పోపులో ఇంగువ కూడా వేసుకోవాలి.తరువాత ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు మగ్గిన తరువాత మిగతా కూరగాయలు ,కొద్దిగా పసుపు వేసి కలిపి 5 నిముసాలు మగ్గించాలి.
  5. కూరగాయలు మగ్గిన తరువాత ఉడికించిన కందిపప్పు ,చింతపండు రసం వేసి కలుపుకోవాలి .రెడీ చేసుకున్న మసాలా కూడా వేసి కలుపుకోవాలి.తరువాత తగినంత నీళ్లు,ఉప్పు వేసుకొని సాంబార్ ను మరిగించాలి. ఒక గ్లాస్ బియ్యము ఐతే 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి.అప్పుడే అన్నము ,కూరగాయలు బాగా ఉడుకుతాయి.
  6. ఇప్పుడు సాంబార్ మరిగిన తరువాత నానబెట్టిన బియ్యము వేసి కలిపి ఉడికించాలి.మూడు భాగాలు ఉడికిన తరువాత మంట తగ్గించి చిన్న మంట మీద ఉడికించాలి.
  7. అన్నము కొద్దిగా లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసివేయాలి.కొత్తిమీర .,కరివేపాకు వేసి కలుపుకోవడమే ఇంకా.
  8. కొత్తిమీర తో అలంకరించి వడ్డించుకోవడమే ఇంకా వేడి వేడిగా ...:relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర