హోమ్ / వంటకాలు / తోఫు పరాఠా అవకాడో చట్నీ

Photo of Tofu paratha with avcado pickle by Swapna Tirumamidi at BetterButter
80
2
0.0(0)
0

తోఫు పరాఠా అవకాడో చట్నీ

Sep-19-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోఫు పరాఠా అవకాడో చట్నీ రెసిపీ గురించి

తోఫు అనేది సోయానుంచి తయారైన పదార్థము...చూడ్డానికి పన్నీర్ లా ఉంటుంది....పన్నీర్ కన్నా మృదువుగా ఉంటుంది...రుచి విషయానికి వస్తే తోఫు కి ఏరకమైన రుచి గానీ వాసన గానీ వుండదు.... కొంచం చప్పగా ఉంటుంది... కానీ పోషక విలువలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి .పాల లో లాక్టోజ్ పడక లేదా ఇష్టం లేక ఇబ్బంది పడేవారు...చంటి పిల్లలు...పెద్దలు చాలా మంది ఉంటారు,వారికి సరైన ప్రోటీను అందదు.అలాంటివారికి తోఫు చాలా మంచి ఆహారం.

రెసిపీ ట్యాగ్

 • చంటి పిల్లలకి తినిపించ తగినవి
 • శాఖాహారం
 • తేలికైనవి
 • పంజాబీ
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • ప్రాథమిక వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. తోఫు 450 గ్రా..
 2. కేరేట్ కోరు ఒక కప్
 3. అల్లం ముక్క 1(పేస్ట్ ఐతే ఒక పెద్దస్పూన్)
 4. పచ్చిమిర్చి 3
 5. జీలకర్ర అరచెమ్చా
 6. గరం మసాలపొడి ఒక చెంచా
 7. ఉప్పు అర చెంచా
 8. కొత్తిమీర సన్నగా తరిగినది 4 చెంచాలు.
 9. చపాతీ కి....చపాతీ పిండి 2 కప్పులు
 10. ఉప్పు సరిపడా
 11. నూని ఒక కప్.
 12. బటర్ ఒక కప్.
 13. అవకాడో చట్నీ కి....అవకాడో 1
 14. జీలకర్ర పావు చెంచా
 15. ఆవాలు పావు చెంచా
 16. మినపప్పు పావు చెంచా
 17. ఉప్పు పావు చెంచా
 18. ఎండు మిర్చి 2
 19. కరివేపాకు ఒక రెమ్మ
 20. నిమ్మకాయ ఒక చెక్క.
 21. పసుపు చిటికెడు.
 22. ఆలివ్ ఆయిల్ ఒక స్పూను.

సూచనలు

 1. ముందుగా చపాతీ పిండి,సాల్ట్,నీరు కొన్చమ్ నూని వేసి కలుపుకొని ముద్దచేసి పక్కనపెట్టుకోవాలి.
 2. మిక్సీ జార్లో జీలకర్ర,పచ్చిమిర్చి, అల్లం వేసి నీరు వెయ్యకుండా ఆడుకోవాలి.
 3. ఇప్పుడు తోఫు ని సన్నగా కోరి నీరు ఏమైనా ఉంటే రెండు చేతులమధ్య పెట్టి జాగ్రత్తగా వత్తి నీటిని తీసేసి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు అందులో కేరేట్ కోరు,కొత్తిమీర తరుగు,అల్లం మిర్చి జీలకర్ర మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
 5. ఇప్పుడు కొద్దిగా సాల్ట్,గరం మసాలపొడి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
 6. ఇప్పుడు చపాతీ పిండిని ఉండలుగా చేసి పెట్టుకోవాలి
 7. ఒక చపాతీ ఉండ ఎంత ఉందో అంత పరిమాణం లో తోఫు మిశ్రమం ఉండేలా చూసుకొని ....ఒక్కొక్క చపాతీ వుండలోనూ స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి.
 8. ఇప్పుడు పొయ్యిమీద పెనం పెట్టుకుని వేడిచేసుకోవాలి.
 9. అది వేడయ్యేలోపు ఒక్కొక్క పరోటాని వత్తుకోవాలి.
 10. ఇప్పుడు పెనం మీద వేసుకుని నూనె గానీ ,బట్టర్ గానీ రాస్తూ సన్నసెగ మీద రెండువైపులా కాల్చుకోవాలి.
 11. ఇప్పుడు అవకాడో చట్నీ చూద్దాం....ముందుగా పోపు కి కొద్దిగా నూనె వేడిచేసుకోవాలి
 12. అందులో ఆవాలు..ఎండు మిర్చి, మినపప్పు..జీలకర్ర (ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు)వేసుకుని వేయించి ,కరివేపాకు వేసి వేయించి దించి వేరే గిన్నీలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి..
 13. ఇప్పుడు అవకాడో ని తొక్క ఒలిచి,లోపలి గింజ తీసి పడేసి ముక్కలు చేసి మిక్సిజార్లో వేసుకోవాలి
 14. ఇప్పుడు ఉప్పు,పసుపు,పోపులో వేయించిన ఎండు మిర్చిని మాత్రమే చిదిపి వేసి...ఒక్కసారి మిక్సీని రన్ చేసి ఆపేయాలి.
 15. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పోపుగిన్నిలోకి తీసుకుని వెంటనే నిమ్మరసం పిండి ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి పెట్టుకుంటే అవకాడో చట్నీ సిద్ధం అయినట్టే...
 16. ఇక వేడి వేడి పరాఠాలు సిల్వర్ ఫాయిల్ లో చుట్టి, అవకాడో చట్నీ తో ...కాస్త కమ్మని గడ్డ పెరుగుతో....ఏదో ఒక పండు ...ఒక సలాడ్ తో లంచ్ బాక్స్ ని సిద్ధం చేస్తే ఇక పరిపూర్ణమైయిన భోజనం మనం అందించినట్టే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర