ఉసిరికాయ నల్లపచ్చడి | AMLA PACHADI Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • AMLA PACHADI recipe in Telugu,ఉసిరికాయ నల్లపచ్చడి, రమ్య వూటుకూరి
ఉసిరికాయ నల్లపచ్చడిby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  70

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

ఉసిరికాయ నల్లపచ్చడి వంటకం

ఉసిరికాయ నల్లపచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make AMLA PACHADI Recipe in Telugu )

 • ఉసిరి కాయలు 1 కెజి
 • సాల్ట్ తగినంత
 • పసుపు 1 టేబుల్ స్పూన్
 • కారం 200 గ్రాములు
 • తాలింపు కోసం
 • పల్లి ఆయిల్ 1 కప్
 • ఆవాలు 1 స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • మినప్పప్పు 1 స్పూన్
 • ఎండుమిర్చి 6
 • ఇంగువ 1/2స్పూన్
 • కరివేపాకు 2 రెమ్మలు

ఉసిరికాయ నల్లపచ్చడి | How to make AMLA PACHADI Recipe in Telugu

 1. ముందుగా ఉసిరికాయలు కడిగి తుడిచి ఆరబెట్టాలి
 2. ఆరిన ఉసిరికాయలు గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి
 3. ఈ ముక్కల్లో పసుపు వేసి బాగా కలిపి గాలి చొరని జోడిలో 3 రోజులు ఉంచాలి
 4. 4 వ రోజు తగినంత సాల్ట్ వేసుకొని బాగా దంచి జాడి లో భద్రపరచాలి
 5. దీనికి కారం కలిపి ఇంగువ పోపు వేసుకోవాలి
 6. కొన్ని రోజులకు ఇది నల్లగా అవుతుంది కానీ రుచి మాత్రం సూపర్

నా చిట్కా:

నల్లగా ఉంటే ఇష్టపడని వాళ్ళు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొంటే కలర్ మారదు

Reviews for AMLA PACHADI Recipe in Telugu (0)