పులిహోర గోంగూర పచ్చడి | Pulihora gongura pachadi Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pulihora gongura pachadi recipe in Telugu,పులిహోర గోంగూర పచ్చడి, Pravallika Srinivas
పులిహోర గోంగూర పచ్చడిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

పులిహోర గోంగూర పచ్చడి వంటకం

పులిహోర గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pulihora gongura pachadi Recipe in Telugu )

 • గోంగూర 1 kg
 • పోపుదినుసులు 1 tbsp
 • మెంతులు 20gms
 • ఇంగువ 2 చిటికెలు
 • నూనె 50 మీ.లి
 • ఎండు మిరపకాయలు 250 గ్రా
 • వెల్లుల్లిపాయలు 10
 • ఉప్పు 100 gms
 • చింతపండు 200gms
 • నీరు 1 గ్లాస్

పులిహోర గోంగూర పచ్చడి | How to make Pulihora gongura pachadi Recipe in Telugu

 1. ముందుగా గోంగూర వలిచి కడిగి వడకట్టి ఎండలో ఒక గంట ఆరనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా ఎండనివ్వాలి .
 2. చింతపండు లో సరిపడా వేడినీరు పోసి నానిన తర్వాత చిల్లులగిన్నెలో వాడకట్టుకొని చింతపండు గుజ్జుని రెడీ చేసుకోవాలి . వేరొక కడైయిలో 1 స్పూన్ నూనె తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని వేసి ఉడకనివ్వాలి. దగ్గర పడ్డాక తీసి చల్లారనివ్వాలి.
 3. ఒక కడాయి పెట్టుకొని నూనె లేకుండా గోంగూర వేయించి పక్కన పెట్టుకోవాలి.అదే బాండీ లో కొంచం నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి.
 4. ఇప్పుడు గ్రైండర్ లో ఎండుమిరపకాయలు గోంగూర వేసి రుబ్బుకొని ఆ తర్వాత ఉప్పు, చింతపండు పులుసు ,వేయించిన మెంతులు కూడా గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి.మెదిగిన తర్వాత ఒక జాడి లో తీసి పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు కావాలి అంటే అపుడు ఒక బౌల్ లో తీసుకొని కాలాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,వెల్లుల్లిపాయలు వేసుకొని ఇంగువ వేసి పచ్చడి లో కలుపుకోవాలి.
 6. అంతే పులిహోర గోంగూర అన్నం లో వెస్కొని తినడానికి రెడీ .

నా చిట్కా:

నిలువ పచ్చడి కాబట్టి గ్రైండర్ మరియు జాడీలు తడిలేకుండా చూసుకోవాలి. కొండగొంగూర అయితే చాలా బాగుంటుంది.

Reviews for Pulihora gongura pachadi Recipe in Telugu (0)