హోమ్ / వంటకాలు / అల్లం పచ్చడి

Photo of GINGER pickle  by Kavitha Perumareddy at BetterButter
1472
1
0.0(0)
0

అల్లం పచ్చడి

Sep-20-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పచ్చడి రెసిపీ గురించి

అల్లం పచ్చడి రకరకాలుగా చేసుకుంటారు.నేను కొద్దిగా సులభంగా చేసేపద్దతి ఇక్కడ చెపుతున్నాను.అల్లం వల్ల అరుగుదల మంచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. అల్లం 100 గ్రామ్స్
  2. చింతపండు 100 గ్రామ్స్
  3. బెల్లం 100 గ్రామ్స్
  4. ఎండుమిర్చి 20
  5. వెల్లుల్లి 10 రెబ్బలు
  6. నూనె 200 గ్రామ్స్
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. జీలకర్ర 1 స్పున్
  9. కారం 1 స్పున్
  10. ఉప్పు తగినంత
  11. పోపుగింజెలు 2 స్పూన్స్
  12. ఇంగువ పావుస్పూన్

సూచనలు

  1. ముందుగా అల్లం శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు కూడా ఒక గిన్నెలో నీళ్లు పోసి కడిగి న్నానబెట్టుకోవాలి.మిగతా అన్ని వస్తువులు రెడీగా పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 3 స్పూన్స్ నూనె వేసి వేడి చేసి అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి.
  3. అల్లం వేగిన తరువాత దానిలో ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.తరువాత నానబెట్టిన చింతపండు, బెల్లం తురుము వేసి కలిపి 5 నిముసాలు చిన్న మంటమీద ఉంచాలి.
  4. చల్లారిన తరువాత తగినంత ఉప్పు,కారం స్పున్ ,జీలకర్ర స్పున్ వేసి రోటిలో కానీ మిక్షిలో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చడి గట్టిగా ఉంటే చింతపండు నానబెట్టిన నీళ్లు కలుపుతూ రుబ్బుకోవాలి. తరువాత పోయిమీద మరో బాండీలో మిగతా నూనె అంతా వేసి పోపుగింజెలు ,వెల్లుల్లి, కరివేపాకుతో పోపు వేసుకోవాలి.ఇంగువ కూడా వేసుకోవాలి పోపులో.
  5. పోపు వేగిన తరువాత దంచుకున్న అల్లం పచ్చడి వేసి కలిపి 5 నిముసాలు ఉంచాలి.ఇంకా పచ్చడి రెడీ.
  6. చల్లగా ఐన తరువాత గిన్నెలో తీసిపెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర