హోమ్ / వంటకాలు / టమాటా పచ్చడి

Photo of TAMAATA pickle by Kavitha Perumareddy at BetterButter
558
0
0.0(0)
0

టమాటా పచ్చడి

Sep-20-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి చేయడం కొత్తగా చేసుకొనే వాళ్లకు చాలా సులభం గా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. టమాటాలు కేజీ
  2. చింతపండు 200 గ్రామ్స్
  3. కారం 5 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. పసుపు 1 స్పున్
  6. నూనె 200 గ్రామ్స్
  7. పోపుగింజెలు 2 స్పూన్స్
  8. కరివేపాకు 3 రెమ్మలు
  9. ఎండుమిర్చి పోపుకు 3
  10. వెల్లుల్లి రెబ్బలు 10

సూచనలు

  1. ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మందంగా వుండే బాండీ తీసుకొని పోయిమీద పెట్టి టమాట ముక్కలు ,పసుపుస్పున్,కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించాలి.
  3. టమాటాలు కొద్దిగా మగ్గిన తరువాత చింతపండు వేసి కలిపి మరల మగ్గించాలి. టమాటాలు బాగా మెత్తగా ఉడికి దగ్గర పడేదాక మగ్గించాలి.
  4. ఇప్పుడు మగ్గిన టమాటా లో కారం,తగినంత ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద కొద్దిగా సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  5. చల్లారిన తరువాత రోటిలో వేసి రుబ్బుకోవాలి. లేదా పప్పుగుత్తి తో మెత్తగా ఎనుపుకోవచ్చు.
  6. ఇప్పుడు పోయిమీద ఇంకో బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజెలు ,వెల్లుల్లి,ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేగిన తరువాత రుబ్బిన టమాటా పచ్చడి వేసి కలిపి 5 నిముసాలు చిన్న మంట మీద ఉంచాలి.
  7. ఇంకా చల్లారిన తరువాత గిన్నెలో తీసిపెట్టుకోవాలి.ఒక వారం రోజులు నిలువ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర