చింతకాయ పచ్చడి | Raw Tamarind Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Raw Tamarind Pickle recipe in Telugu,చింతకాయ పచ్చడి, Pravallika Srinivas
చింతకాయ పచ్చడిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

చింతకాయ పచ్చడి వంటకం

చింతకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw Tamarind Pickle Recipe in Telugu )

 • చింతకాయలు 1 kg
 • ఉప్పు 250kg
 • పసుపు 50gms
 • పచ్చిమిర్చి 10
 • నూనె 1 గరిటెడు
 • ఉల్లిపాయ 1
 • పోపు దినుసులు 1 tbsp
 • వెల్లులి రెబ్బలు 1
 • ఇంగువ 1/4 sp
 • కర్వేపాకు 2 రెబ్బలు

చింతకాయ పచ్చడి | How to make Raw Tamarind Pickle Recipe in Telugu

 1. ముందుగా చింతకాయలు పెద్ద సైజు వి కండ ఎక్కువ ఉన్నవి ఈ పచ్చడి కి బాగుంటాయి. చింతకాయలు ని కడిగి యండలో ఆరబెట్టండి. ఇప్పుడు చింతకాయ పక్కన ఉన్న పీచు తీసి ముక్కలుగా తుంచుకోవాలి ..
 2. రోట్లో చింతకాయలూ ఉప్పు పసుపు వేసి గింజ నలగకుండా గుజ్జు బయటకు వచ్చే విధంగా దంచు కోవాలి. ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని 3 రోజులు ఉంచాలి.
 3. 3 వ రోజున వీలైన వరకు గింజలు తీసేసి మరొక సారి కచ్చా పచ్చగా దంచు కోవాలి. చింతకాయ తొక్కు ని జాడి లో భద్ర పరుచు కోవాలి. ఇది సంవత్సరం అంత నిలువ ఉంటుంది. దీనినే ఉప్పు చింతకాయ తొక్కు అంటారు.
 4. ఇప్పుడు చింతకాయ పచ్చడి కోసం ఉప్పు చింతకాయ తొక్కు ఒక కప్పు తొక్కుకి 10 పచ్చిమిర్చి ,1 పెద్ద ఉల్లిపాయ తరిగి రోట్లో దంచుకోవాలి .ఒక కాలాయి లో నూనె వేసి పోపుదినుసులు ,కర్వేపాకు ,ఇంగువ, వెల్లులి రెబ్బలు వేసి చిటపటలాడాక తయారైన తాలింపు ని పచ్చడి లో వెస్కొని కలుపుకోవాలి.

నా చిట్కా:

చింతకాయ తొక్కు తడి తగల కుండా భద్రపరుచుకోవాలి .

Reviews for Raw Tamarind Pickle Recipe in Telugu (0)