హోమ్ / వంటకాలు / ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి

Photo of Gooseberry  red chilly pickle  by Kavitha Perumareddy at BetterButter
489
1
0.0(0)
0

ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి

Sep-20-2018
Kavitha Perumareddy
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ ఎండుమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఉసిరికాయ ఏరూపంలో తిన్న శరీరానికి కావలిసిన విటమిన్స్అందుతాయి.ముఖ్యంగా సి విటమిన్ అందుతుంది.సి విటమిన్ మిగతా ఆహారంలోని పోషకాలను శరీరానికి అందేలా చేస్తుంది.ఐరన్ అందుతుంది.అందుకని ఎదో ఒక రూపంలో ఉసిరికాయ తినాలి అంటారు మన పెద్దలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 6

  1. ఉసిరికాయ లు అరకిలో
  2. ఎండుమిర్చి 20,కానీ 25 కానీ మీ ఇష్టం
  3. ఉప్పు తగినంత
  4. నూనె 4 స్పూన్స్
  5. మినపప్పు 1 స్పున్
  6. శనగపప్పు 1 స్పున్
  7. జీలకర్ర 1 స్పున్
  8. ధనియాలు 1 స్పున్
  9. మెంతులు పావు స్పున్
  10. ఆవాలు 1 స్పున్
  11. వెల్లుల్లి రెబ్బలు 6
  12. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి పొడి టవల్ తో తుడిచి పెట్టుకోవాలి. దెబ్బ తిన్న ఉసిరికాయలు తీసివేయాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి మినప్పప్పు, సెనగపప్పు, జీలకర్ర, మెంతులు,ధనియాలు, ఎండుమిర్చి వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. మరల అదే బాండీలో స్పున్ నూనె వేసి ఉసిరికాయలు వేసి మూత పెట్టి చిన్న మంట మీద మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చేత్తో వత్తి చూస్తే గింజె విడిపోతే ఉసిరికాయలు మగ్గినట్లే .అన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి.
  3. ఉసిరికాయలు గింజేలు వేరు చేసి పెట్టుకోవాలి. తరువాత రోటిలో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పోపుగింజెలు,తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ఉసిరికాయలు ముక్కలు కూడా వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి.
  4. ఇప్పుడు దంచిన తరువాత పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిని వేసి పోపు వేగిన తరువాత దంచిన పచ్చడిని వేసి అంతా పోపు లో కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.
  5. చల్లారిన తరువాత వేరే గిన్నెలో తీసుపెట్టుకోవాలి. ఈ పచ్చడి నెలరోజులు ఐనా నిలువ ఉంటుంది. తడి తగలకుండా ఉండాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర