టమాటో పండుమిర్చి పచ్చడి | Tomato Redchilli Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato Redchilli Pickle recipe in Telugu,టమాటో పండుమిర్చి పచ్చడి, Pravallika Srinivas
టమాటో పండుమిర్చి పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

టమాటో పండుమిర్చి పచ్చడి వంటకం

టమాటో పండుమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato Redchilli Pickle Recipe in Telugu )

  • టొమాటోలు 1 kg
  • పండుమిర్చి 250gms
  • చింతపండు 100gms
  • గండుప్పు 1/2 t glass
  • వేయించిన మెంతులు 1 tbsp
  • యండుమిరపకాయలు 4
  • ఆవాలు 1 tbsp
  • జీలకర్ర 1 tbsp
  • నూనె 200 gm
  • ఇంగువ 1/2 spoon

టమాటో పండుమిర్చి పచ్చడి | How to make Tomato Redchilli Pickle Recipe in Telugu

  1. ముందుగా టొమాటోలు పండుమిర్చి తొడిమలు వలిచినవి కడిగి ఆరబెట్టండి. . టొమాటోస్ నుండి రసం పిండి విడిగా ఒక డబ్బాలో పోసి ఆ టమాటో రసం లో చింతపండు నాన బెట్టుకోవాలి . .
  2. చింతపండు ఒక 3 గంటలు నానిన తర్వాత పొడిగా ఉన్న గ్రైండర్ లో పండుమిర్చి ,గండుప్పు ,వేయించిన మెంతులు వేసి కొంచం మెదగనివ్వాలి . ఇప్పుడు చింతపండు, టమాటో ముక్కలు మిగిలిన టమాటో రసం అన్ని వేసి మెత్తగా మెదగనివ్వాలి.
  3. ఇప్పుడు ఒక పెద్ద కడైని స్టవ్ మీద పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర ఇంగువ యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక పచ్చడి ని బాండి లో వెస్కొని సన్నని మంట పై మగ్గనివ్వాలి. అడుగు అంట కుండా కలుపుకోవాలి. నూనె విడిచాక స్టవ్ ఆఫ్ చేసాక చల్లారనివ్వాలి .
  4. తయారైన పచ్చడి ని గాజు సీసా లో భద్రపరుచుకోవాలి.

నా చిట్కా:

తడి లేకుండా చూసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది

Reviews for Tomato Redchilli Pickle Recipe in Telugu (0)