కొబ్బరి టమాటా పచ్చడి | Kobbari tomato pacchadi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kobbari  tomato pacchadi  recipe in Telugu,కొబ్బరి టమాటా పచ్చడి, Kavitha Perumareddy
కొబ్బరి టమాటా పచ్చడిby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

కొబ్బరి టమాటా పచ్చడి వంటకం

కొబ్బరి టమాటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kobbari tomato pacchadi Recipe in Telugu )

  • పచ్చి కొబ్బరి ఒక చిప్ప
  • టమాటాలు 2 పెద్దవి
  • పచ్చిమిర్చి 6
  • ఎండుమిర్చి 6
  • జీలకర్ర స్పున్
  • ధనియాలు స్పున్
  • మినపప్పు 2 స్పూన్స్
  • సెనగపప్పు 2 స్పూన్స్
  • మెంతులు పావు స్పున్
  • వెల్లుల్లి రెబ్బలు 6
  • పసుపు సగం స్పున్
  • పోపుగింజెలు స్పున్
  • నూనె 3 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • చింతపండు కొద్దిగా ఉసిరికాయ అంత

కొబ్బరి టమాటా పచ్చడి | How to make Kobbari tomato pacchadi Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరిని చిన్నముక్కలుగా కట్ చేసిపెట్టుకోవాలి.టమాటాలు కట్ చేసిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద ఒక బాండిపెట్టి స్పున్ నూనె వేసి మినప్పప్పు, సెనగపప్పు, జీలకర,ధనియాలు, మెంతులు ,ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తరువాత పచ్చిమిర్చి కూడా అందులోనే వేసి వేపుకొని వేరే ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి టమాట ముక్కలు, పసుపు,కొద్దిగా ఉప్పు,చింతపండు వేసి బాగా మెత్తగా మగ్గించాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి,పోపుదినుసులు,పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత కొబ్బరిముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత మగ్గించిన టమాటాలు కూడా వేసి అంతా కలిసేలా బాగా దంచుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు,ఎండుమిర్చి వెల్లుల్లి,కరివేపాకు వేసి పోపుపెట్టుకొని పచ్చడిలో కలుపుకోవాలి. అంతే రుచికరమైన కొబ్బరి టమాటా పచ్చడి రెడీ .

నా చిట్కా:

పోపులో ఇంగువ ఇష్టం ఐతే వేసుకోవచ్చు.

Reviews for Kobbari tomato pacchadi Recipe in Telugu (0)