హోమ్ / వంటకాలు / కొబ్బరి టమాటా పచ్చడి

Photo of Kobbari  tomato pacchadi  by Kavitha Perumareddy at BetterButter
730
1
0.0(0)
0

కొబ్బరి టమాటా పచ్చడి

Sep-21-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి టమాటా పచ్చడి రెసిపీ గురించి

కొబ్బరి హెల్త్ కు మంచిది .చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.కొబ్బరితో ఏవంట చేసిన చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి కొబ్బరి ఒక చిప్ప
  2. టమాటాలు 2 పెద్దవి
  3. పచ్చిమిర్చి 6
  4. ఎండుమిర్చి 6
  5. జీలకర్ర స్పున్
  6. ధనియాలు స్పున్
  7. మినపప్పు 2 స్పూన్స్
  8. సెనగపప్పు 2 స్పూన్స్
  9. మెంతులు పావు స్పున్
  10. వెల్లుల్లి రెబ్బలు 6
  11. పసుపు సగం స్పున్
  12. పోపుగింజెలు స్పున్
  13. నూనె 3 స్పూన్స్
  14. ఉప్పు తగినంత
  15. చింతపండు కొద్దిగా ఉసిరికాయ అంత

సూచనలు

  1. ముందుగా కొబ్బరిని చిన్నముక్కలుగా కట్ చేసిపెట్టుకోవాలి.టమాటాలు కట్ చేసిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద ఒక బాండిపెట్టి స్పున్ నూనె వేసి మినప్పప్పు, సెనగపప్పు, జీలకర,ధనియాలు, మెంతులు ,ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తరువాత పచ్చిమిర్చి కూడా అందులోనే వేసి వేపుకొని వేరే ప్లేట్ లో తీసిపెట్టుకోవాలి.
  3. మళ్ళీ అదే బాండీలో స్పున్ నూనె వేసి టమాట ముక్కలు, పసుపు,కొద్దిగా ఉప్పు,చింతపండు వేసి బాగా మెత్తగా మగ్గించాలి.
  4. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించిన ఎండుమిర్చి,పోపుదినుసులు,పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత కొబ్బరిముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత మగ్గించిన టమాటాలు కూడా వేసి అంతా కలిసేలా బాగా దంచుకోవాలి.
  5. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు,ఎండుమిర్చి వెల్లుల్లి,కరివేపాకు వేసి పోపుపెట్టుకొని పచ్చడిలో కలుపుకోవాలి. అంతే రుచికరమైన కొబ్బరి టమాటా పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర