పండ్లకారం పచ్చడి | Red Chilli Pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Red Chilli Pickle recipe in Telugu,పండ్లకారం పచ్చడి, Pravallika Srinivas
పండ్లకారం పచ్చడిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

పండ్లకారం పచ్చడి వంటకం

పండ్లకారం పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Red Chilli Pickle Recipe in Telugu )

  • పండుమిరపకాయలు 1 kg
  • చింతపండు 200 గ్రా
  • ఉప్పు 200 గ్రా
  • వేయించిన మెంతులు 20 గ్రా
  • నూనె 3 చెంచాలు
  • ఇంగువ 1/4 స్పూన్
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • వెల్లులి రెబ్బలు 10
  • పోపుదినుసులు 1 స్పూన్
  • ఎండుమిరపకాయలు 2

పండ్లకారం పచ్చడి | How to make Red Chilli Pickle Recipe in Telugu

  1. ముందుగా పండుమిరపకాయలను కడిగి ఆరబెట్టి తొడిమలు వలుచుకోవాలి . చింతపండు లోని గింజలు తీసేసి శుభ్రపరుచుకోవాలి.
  2. పొడి గ్రైండర్ లో పండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు ,వేయించిన మెంతులు అన్ని కలిపి గ్రైండర్ లో రుబ్బుకోవాలి.మరీ మెత్తగా కాకుండా కొంచం కొంచం కచ్చా పచ్చగా రుబ్బుకొని ఒక జాడీలో భద్రపరుచుకోవాలి.
  3. ఈ పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. రుబ్బుకొని ఉన్న పండుమిర్చి ని ఒక గిన్నెలో టెస్కొని పోపు కోసం కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, వెల్లులి రెబ్బలు, కర్వేపాకు,ఇంగువ,యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక పచ్చడి లో వేసి కలుపుకోవాలి. అంతే పండుమిర్చి పచ్చడి రెడీ ...

నా చిట్కా:

ఈ పండుమిర్చి పచ్చడి వేడి కాబట్టి ఒక 20ml ఆముదం రుబ్బేటప్పుడు వేస్కొవచ్చు.

Reviews for Red Chilli Pickle Recipe in Telugu (0)