టమోటా పచ్చడి | Tamoto pachadi Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  21st Sep 2018  |  
4.5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tamoto pachadi by Anitha Rani at BetterButter
టమోటా పచ్చడిby Anitha Rani
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

25

2

టమోటా పచ్చడి వంటకం

టమోటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamoto pachadi Recipe in Telugu )

 • టమోటాలు : 1 కిలో
 • చింతపండు : 150 గ్రా
 • నువ్వుల నూనె : 1/4 కిలో
 • కారం : 75 గ్రా
 • ఉప్పు : 100 గ్రా
 • ఆవాలు : 4 స్పూన్లు
 • మెంతులు : 2 స్పూన్లు

టమోటా పచ్చడి | How to make Tamoto pachadi Recipe in Telugu

 1. కిలో టమోటా లు బాగా కడిగి తడి లేకుండా గుడ్డ తో తుడవాలి.  
 2. మందపాటి ప్యాన్   లో టమోటా ముక్కలు,150 గ్రా చింతపండు, సరిపడా ఉప్పు,కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద చిన్న మంట పైన బాగా ఉడకనివ్వాలి, నీరు అంతా తగ్గిన తరువాత సరిపడా కారము పొడి,4స్పూన్స్ ఆవాలు+2స్పూన్స్ మెంతులు కలిపిన పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి . 
 3. బాగా చల్లారిన తరువాత మిక్సీ కి లేదా రొటి లో వేసుకొని రుబ్బుకోవాలి.  
 4. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక ఆవాలు,వెల్లుల్లి ,ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేగాక మిక్సీ లో వేసుకున్న పచ్చడి నూనె లో వేసి బాగా దెగ్గరగా వచ్చేవరకు కలపాలి. 
 5. ఉప్పు ,కారము తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు. చల్లారిన తరువాత సీసా లోకి వేసుకుంటే సరిపోతుంది.

నా చిట్కా:

టమోటాల ను తడి లేకుండా పచ్చడి చేయడము వలన చాలా రోజులు నిలువ ఉంటుంది.

Reviews for Tamoto pachadi Recipe in Telugu (2)

Terala Sirishaa year ago

జవాబు వ్రాయండి

Vamsidhar Reddya year ago

జవాబు వ్రాయండి