హోమ్ / వంటకాలు / పల్లీ కొబ్బరి చెట్నీ

Photo of Peenut coconut chetny by Chandrika Marripudi at BetterButter
481
1
0.0(0)
0

పల్లీ కొబ్బరి చెట్నీ

Sep-21-2018
Chandrika Marripudi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ కొబ్బరి చెట్నీ రెసిపీ గురించి

పల్లీలు, పచ్చికొబ్బరి పచ్చిమిర్చి తో చేసుకునే తేలికగా చేసుకునే చెట్నీ.ఇడ్లీ,దోశ,గారె లాంటి వాటికి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. పల్లీలు : 2 గుప్పెళ్ళు
  2. పచ్చికొబ్బరి : 1 చిప్ప(చిన్న ముక్కలుగా తరగాలి.)
  3. పచ్చిమిర్చి : 10
  4. నూనె : 4 స్పూన్లు
  5. చింతపండు : చిన్న రెబ్బ
  6. వెల్లుల్లి : 4 రెబ్బలు
  7. ఆవాలు : 1 స్పూన్
  8. మినప్పప్పు : 1 స్పూన్
  9. పచ్చిశనగపప్పు : 2 స్పూన్లు
  10. జీలకర్ర : 1స్పూన్
  11. ఎండుమిర్చి : 2
  12. ఉప్పు : తగినంత
  13. కరివేపాకు : 2రెమ్మలు

సూచనలు

  1. ముందుగా పల్లీలు, పచ్చిమిర్చి 1 స్పూను నూనె వేసి వేయించాలి.
  2. పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  3. మిక్సి జార్లో వేయించిన పల్లీలు,,పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేయాలి.
  4. అందులోనే తగినంత ఉప్పు,వెల్లుల్లి, చింతపండు వేసి మిక్సి పట్టాలి
  5. కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టాలి
  6. తయారయిన చెట్నీని ఒక గిన్నెలో తీసుకోవాలి.
  7. బాండీలో 2 స్పూన్ల నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి పోపు పెట్టి చెట్నీలో వేసి కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర