హోమ్ / వంటకాలు / కొబ్బరి పచ్చడి

Photo of Coconut chetny by Chandrika Marripudi at BetterButter
69
1
0.0(0)
0

కొబ్బరి పచ్చడి

Sep-21-2018
Chandrika Marripudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

చాలా రుచికరమైన, పాతకాలపు వంట.ఎండుమిర్చి తో చేస్తారు.వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి కొబ్బరి: 2 చిప్పలు
  2. ఎండుమిర్చి : 20
  3. పచ్చి శనగపప్పు : 4 స్పూన్లు
  4. మినప్పప్పు : 4 స్పూన్లు
  5. జీలకర్ర : 1 స్పూన్
  6. చింతపండు : నిమ్మ కాయ సైజంత
  7. వెల్లుల్లి రెబ్బలు : 10
  8. నూనె : 6 టేబుల్ స్పూన్లు
  9. ఉప్పు : తగినంత
  10. కరివేపాకు : కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బాండీలో 2 స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
  2. తరువాత కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవాలి
  3. చల్లారాక ముందుగా మిర్చి, పప్పుల మిశ్రమాన్ని తగినంత ఉప్పు వేసి మిక్సి పట్టుకోవాలి.
  4. దాన్ని ఒక ప్లేటులోకి తీసుకుని ఇపుడు పచ్చికొబ్బరి ముక్కలు వేసి మిక్సి పట్టాలి.
  5. ముందుగా మిక్సి పట్టిన ఎండుమిర్చి కారం కూడా వేసి చింతపండు,వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా మిక్సి చేసి గిన్నెలో తీసి పెట్టుకోవాలి
  6. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి పోపుదినుసులు, కరివేపాకు వేసి పోపు పెట్టి పచ్చడిని వేసి ఒక నిమిషం కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర