BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పొట్టు పచ్చడి

Photo of Gooseberry Pickle by Pravallika Srinivas at BetterButter
0
1
0(0)
0

ఉసిరికాయ పొట్టు పచ్చడి

Sep-21-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పొట్టు పచ్చడి రెసిపీ గురించి

ఉసిరికాయ లోని సి విటమిన్ వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి తెలుగు ఇంట్లో రోజు మొదటి ముద్ద లో నెయ్యి ,ఉసిరికాయ పొట్టు పచ్చడి వేసుకోవడం ఆనవాయతీగా వస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • కఠినము
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. ఉసిరికాయలు 1 కిలో
  2. ఉప్పు. 1/4 కిలో
  3. పసుపు 50 గ్రా
  4. పచ్చిమిర్చి 1/2 కిలో
  5. వేయించిన మెంతులు 25 గ్రా
  6. నూనె 3 టేబుల్ స్పూన్లు
  7. ఎండుమిరపకాయలు 2
  8. ఇంగువ 1/4 స్పూన్
  9. కర్వేపాకు 2 రెమ్మలు
  10. వెల్లులి రెబ్బలు 10
  11. పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలను కడిగి తేమ లేకుండా ఆరబెట్టండి. ఇప్పుడు ఉసిరికాయలను పొడి గా ఉన్న రోట్లో కొన్ని కాయలను వేసి దంచు కోవాలి.దంచేటపుడు గింజ పగలకుండా చేసుకుంటే మంచిది.అన్ని ఉసిరికాయలను అదే విధంగా దంచుకోవాలి . రోళ్ళు లీని వారు గింజలు లేకుండా ఉసిరికాయలు ముక్కలు కట్ చేసుకోవచ్చు .రోట్లో దంచిన వాటిలో గింజలు ఏరివేయాలి .
  2. ఇప్పుడు తరిగిని ఉసిరికాయలను ఉప్పు పసుపు కలిపి ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. మూడు రోజులు తర్వాత పొట్టు బాగా ఊరుతుంది.
  3. పచ్చిమిర్చి పచ్చివి కాకుండా పండినవి కాకుండా దొరవి అనగా కొంచం బ్రౌన్ రంగు్ ఉండే కాయలను శుభ్రం చేసి ఆరనిచ్చి తొడిమలు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి గ్రైండర్ లో పచ్చిమిర్చి, వేయించిన మెంతులూ ,ఉప్పు వేసి కొంచం మెదగనివ్వాలి .ఊరిన ఉసిరికాయ పొట్టు ని కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకొని జాడి లో భద్రపరుచుకోవాలి .
  4. ఒక కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, వెల్లులి రెబ్బలు , కర్వేపాకు ఇంగువ , యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక పక్కకు తీసిన ఉసిరికాయ పొట్టు పచ్చడి లో కలుపుకొని వేడి అన్నం నెయ్యి పచ్చడి కలిపి తినడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర