హోమ్ / వంటకాలు / నువ్వుల పచ్చడి

Photo of SESAME pickle  by Kavitha Perumareddy at BetterButter
90
3
0.0(0)
0

నువ్వుల పచ్చడి

Sep-21-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. టీనేజ్ అమ్మాయిలకు నెలసరి ఇబ్బందులు రాకుండా చేస్తుంది. అందుకని పిల్లలకు ఏదోఒక విధంగా తినిపించాలి. ఐరన్ కూడా బాగా అందుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. తెల్ల నువ్వులు 4 పెద్ద స్పూన్స్
  2. ఎండుమిర్చి 15
  3. మినప్పప్పు స్పున్
  4. ఆవాలు స్పున్
  5. మెంతులు పావుస్పూన్
  6. చింతపండు నిమ్మకాయ సైజ్
  7. నూనె 2 స్పూన్స్
  8. పోపుగింజలు స్పున్
  9. కరివేపాకు కొద్దిగా
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి మినపప్పు,ఆవాలు,మెంతులు,ఎండుమిర్చి వేసి వేగిన తరువాత నువ్వులు వేసి వేపుకోవాలి.నువ్వులు ముందుగా వేయకూడదు.వేస్తే తొందరగా వేగి మాడిపోతాయి.
  3. ఇప్పుడు రోటిలో ముందుగా వేయించుకున్న నువ్వులు ,ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
  4. తరువాత నానబెట్టిన చింతపండు వేసి అంతా కలిపి బాగా దంచుకోవాలి. గట్టిగా ఉంటే చింతపండు నానబెట్టిన నీటిని వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పూన్ నూనె వేసి పోపుగింజెలు,కరివేపాకు తో పోపు పెట్టుకోవాలి.పోపు వేసుకోకున్న పర్వాలేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర