టమాటా ఉల్లి పచ్చడి | Tomato onion chutney Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tomato onion chutney recipe in Telugu,టమాటా ఉల్లి పచ్చడి, Reena Andavarapu
టమాటా ఉల్లి పచ్చడిby Reena Andavarapu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    1

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

టమాటా ఉల్లి పచ్చడి వంటకం

టమాటా ఉల్లి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato onion chutney Recipe in Telugu )

  • టమాటా 3 పెద్దవి
  • ఉల్లిపాయ 2
  • ఎండుమిర్చి 3
  • వెల్లుల్లి రెబ్బలు 3
  • కరివేపాకు ఒక రెమ్మ
  • ఆవాలు 1/2 టీస్పూన్
  • మినపప్పు 1/2 టిస్పూన్
  • నూనె తగినంత
  • ఉప్పు తగినంత

టమాటా ఉల్లి పచ్చడి | How to make Tomato onion chutney Recipe in Telugu

  1. ఒక ఫ్యాన్ లో రెండు స్పూన్ నూనె వేడి చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు వేసి వేయించి కోవాలి.
  2. ఉల్లి లేత గోధుమ రంగుగా మారితే తరిగిన టమాటా ముక్కలు వేసి వేయించాలి
  3. టమాటా మెత్తగా ఉడికిన తరువాత గ్యాస్ ఆపి చల్లార్చుకోవాలి
  4. చల్లారాక గ్రైండర్ లో మెత్తగా రుబ్బు కోవాలి
  5. తాలింపు కోసం ఒక స్పూన్ నూనె వేడి చేసి మినపప్పు, ఆవాలు, కరివేపాకు తాలింపు వేసి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి
  6. ఇడ్లీ, దోశ, బ్రెడ్, చపాతీ అన్నిటితో ఎంజాయ్ చేయవచ్చు.

Reviews for Tomato onion chutney Recipe in Telugu (0)