హోమ్ / వంటకాలు / సొరకాయ టమాటో రోటి పచ్చడి

Photo of Bottleguard tomato chutney by Pravallika Srinivas at BetterButter
0
3
0(0)
0

సొరకాయ టమాటో రోటి పచ్చడి

Sep-22-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ టమాటో రోటి పచ్చడి రెసిపీ గురించి

సాదారణంగా కూరగాయలు ముదిరినప్పుడు కూరకు పనికిరావు అని పడేస్తుంటాం.ముదిరిన సొరకాయ పండు టమాటో తో చేసి రుచికరమైన చట్నీ .

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. సొరకాయ 1 చిన్నకాయ
  2. టమాటో. 2
  3. పచ్చిమిర్చి. 10
  4. చింతపండు 1 tbsp
  5. జీలకర్ర 1 tbsp
  6. వెల్లులి రెబ్బలు 4
  7. ఉప్పు 1tbsp
  8. పసుపు 1/4 tbsp
  9. నూనె 3 tbsp
  10. ఇంగువ 1 pinch
  11. కర్వేపాకు 2 రెబ్బలు
  12. పోపు దినుసులు 1 tbsp
  13. యండుమిరపకాయలు 2

సూచనలు

  1. ముందుగా సొరకాయ, టమాటో, పచ్చిమిర్చి కడిగి ముక్కలు తరిగి పెట్టుకోవాలి .ముందుగా చింతపండు నీటిలో నాననివ్వాలి .
  2. ఒక కడాయి లో నూనె వేసి కాగాక జీలకర్ర, వెల్లులి రెబ్బలు ,ఉప్పు, పసుపు వేసి వేగాక తరిగిన ముక్కలు అన్నిటిని కలిపి వేసి మూత పెట్టి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మద్యమద్యలో అడుగు అంట కుండా కలుపుకోవాలి .
  3. ఇప్పుడు మగ్గిన ముక్కలను, నానిన చింతపండు రోటీలో వేసి రుబ్బుకోవాలి.మరీ మెత్తగా కాకుండా కొంచం ముక్కలు కనిపించే విధంగా రుబ్బుకొని ఒక గిన్నిలో తీసుకోవాలి.
  4. స్టవ్ వెలిగించి కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు, కర్వేపాకు ,ఇంగువ, యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక పచ్చడి తో కలుపుకోవాలి. అంతే రుచికరమైన సొరకాయ టమాటో పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర