చుక్క కూర పచ్చడి | Chukkakura pachadi Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chukkakura pachadi recipe in Telugu,చుక్క కూర పచ్చడి, Lakshmi Leelavathi
చుక్క కూర పచ్చడిby Lakshmi Leelavathi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

చుక్క కూర పచ్చడి వంటకం

చుక్క కూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chukkakura pachadi Recipe in Telugu )

  • చుక్క కూర 2 కట్టలు
  • పచ్చిమిర్చి 5
  • చింతపండు నిమ్మకాయంత
  • పల్లిలు కొంచెం వేయించినవి
  • వెల్లుల్లి 6 రెబ్బలు
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర కొంచెం
  • కరివేపాకు
  • నూనె 3 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు కొంచెం

చుక్క కూర పచ్చడి | How to make Chukkakura pachadi Recipe in Telugu

  1. ముందుగా చుక్క కూరను శుభ్రంగా చేసుకోవాలి.తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత చుక్కకురా,పచ్చిమిర్చి వేసి వేయించుకుని అందులో వెల్లుల్లి,చింతపండు,ఉప్పు,కూడా వేసి పక్కన పెట్టు కోవాలి.
  2. తర్వాత రోటిలో వేయించుకున్న మిశ్రమాన్ని వేసి చక్కగా నూరుకోవాలి.
  3. నూరుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో పల్లిలా పొడికూడా వేసి కలుపుకోవాలి.
  4. వేరొక గిన్నెలో ఆయిల్ వేసి వేడి చేసి అందులో ఆవాలు,జీలకర్ర,కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకుని పచ్చడిలో వేసుకుంటే చుక్కకురా పచ్చడి రెడీ అయినట్లే.

Reviews for Chukkakura pachadi Recipe in Telugu (0)