హోమ్ / వంటకాలు / గుంటూరు గోంగూర తొక్కు

Photo of Gongura pickle by Pravallika Srinivas at BetterButter
0
1
0(0)
0

గుంటూరు గోంగూర తొక్కు

Sep-23-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంటూరు గోంగూర తొక్కు రెసిపీ గురించి

అందరికీ అందుబాటులో ఉండే గోంగూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా గోంగూరలో దాగుంది. ఇందులో విటమిన్ సి ,ఎ, బి తో పాటు ఐరన్ ,మెగ్నీషియం ,పొటాషియం ,కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర 1కట్ట
  2. పచ్చిమిరపకాయలు 20
  3. గండుప్పు 2 tbsp
  4. ఉల్లిపాయ 1
  5. నూనె 100gm
  6. యండుమిరపకాయలు 2
  7. పోపుదినుసులు 2tbsp
  8. ఇంగువ 1/4 tbsp
  9. పసుపు 1/4 tbsp

సూచనలు

  1. ముందుగా పుల్లగా ఉన్న గోంగూర కట్ట తీసుకొని కొంచం కాడలు ఉండేట్టు గిల్లుకుని కాడికి చిల్లులబుట్ట లో వేయాలి.
  2. తర్వాత రోట్లో పచ్చిమిర్చి గండుప్పు వేసి బాగా దంచుకోవాలి.
  3. తర్వాత నీరు వడ్డగిల్లిన గోంగూర కొంచం కొంచం వేసి దంచుకోవాలి. ఆలా మొత్తం గోంగూర పచ్చిమిర్చి ఉప్పు తో కలిసేవిధంగా కచ్చాపచ్చా గా దంచుకోవాలి .ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దంచుకోవాలి .
  4. ఇప్పుడు ఇనప కాలాయి లో నూనె వేసి కాగాక పోపు దినుసులు , యండుమిరపకాయలు ,ఇంగువ ,పసుపు , పచ్చిశనగ పప్పు అన్ని వేసి వేగాక దంచుకున్న గోంగూర మిశ్రమాన్ని నూనెలో వేసి బాగా కలిసేట్టు కలుపుతూ ఉండాలి. ఆలా నూనెలో పచ్చివాసన పోయేట్టుగా మీడియం హీట్ లో మగ్గించుకోవాలి.
  5. కొంచం సమయానికి నూనె గోంగూర నుండి విడవగానె సెర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన గుంటూరు గోంగూర తొక్కు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర