హోమ్ / వంటకాలు / కరివేపాకు పచ్చడి

Photo of Karivepaaku chutney by రమ్య వూటుకూరి at BetterButter
53
1
0.0(0)
0

కరివేపాకు పచ్చడి

Sep-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పచ్చడి రెసిపీ గురించి

ఈ చట్నీ దోస అన్నం లోకి బాగుంటుంది. కరివేపాకు తింటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. పోపులో వేస్తే తీసి పక్కనపెట్టేస్తాం చట్నీ చేసుకొంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కరివేపాకు 2 కప్స్
  2. చింతపండు కొంచం (ఉసిరికాయంత)
  3. బెల్లం ఉసిరికాయంత
  4. సాల్ట్ తగినంత
  5. మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్
  6. జీలకర్ర 1 స్పూబ్
  7. పచ్చిమిర్చి 10
  8. ఆయిల్ 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి బా౦డీ పెట్టుకోవాలి
  2. వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి
  3. వేగిన మినప్పప్పు ను మీక్సీ జార్లోకి తీసుకోవాలి
  4. తర్వాత అదే బాండీ లో చింతపండు, పచ్చిమిర్చి వేసి వేపాలి
  5. మిర్చి చింతపండు కూడా మిక్సీ లోకి తీసుకోవాలి
  6. బాండీ లో 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు బాగా వేపాలి స్లో ఫ్లేమ్ లో
  7. కరివేపాకు కూడా మిక్సీ లోకి తీసుకోవాలి
  8. ఇప్పుడు తగినంత సాల్ట్ బెల్లం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే వాటర్ పోసి రుబ్బుకోవాలి
  9. కరివేపాకు పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర