స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి | Smoky green capsicum chutney Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Smoky green capsicum chutney recipe in Telugu,స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి, lakshmi kumari
స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడిby lakshmi kumari
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి వంటకం

స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Smoky green capsicum chutney Recipe in Telugu )

  • గ్రీన్ క్యాప్సికమ్లు ......,2
  • మినప్పప్పు...........1 టీస్పూన్
  • ఆవాలు...............1/2టీస్పూన్
  • మెంతులు...........1/2టీస్పూన్
  • ఎండు మిరపకాయలు...5
  • ఇంగువ.......చిటికెడు
  • చింతపడు....చిన్న ఉసిరి కాయంత
  • ఉప్పు తగినంత
  • చిటికెడు పసుపు
  • కొంచం కరివేపాకు
  • అల్యుమినియం ఫాయిల్ ముక్క

స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి | How to make Smoky green capsicum chutney Recipe in Telugu

  1. తయారు చేయు విధానము: ముందుగా క్యాప్సికమ్ కడిగి, కొంచం నూనె రాయలి. ఫోర్క్ కి గుచ్చి గాస్ స్టవ్ మంట పైన కాల్చుకోవాలి.
  2. కాల్చిన క్యాప్సికమ్ అల్యుమినియం ఫాయిల్ లో చుట్టుకుని పక్కన పెట్టాలి.
  3. పొయ్యి మీద బాణలి ఉంచి అందులో నూనె వెయ్యాలి.
  4. నూనె వేడెక్కిన తర్వాత అందులో మినప్పప్పు, ఎండుమిర్చి వేసి, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఫాయిల్ లో చుట్టి పెట్టుకున్న క్యాప్సికం తీసి, గిన్నె లో నీళ్ళు పోసి క్యాప్సికమ్ వేసి చేతి వేళ్ళతో నల్లగా కాలిన తొక్కని తీసేసి, ముక్కలు చేసుకోవాలి.
  6. పోపు దినుసులు, చింతపండు, పసుపు, ఉప్పు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి, మెత్తగా పొడి అయ్యేక, క్యాప్సికమ్ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  7. మెత్తగా రుబ్బి పచ్చడిని గిన్నె లోకి తీసి, ఆవాలు, కరివేపాకు వేయించి కలుపుకుని పెట్టుకోవాలి.
  8. ఈ పచ్చడి వేడి అన్నం లో కలుపుకుని తింటే బాగుంటుంది.
  9. దోసెలలోకి కూడా వెరైటీగా బాగుంటుంది.

నా చిట్కా:

గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ తో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు.

Reviews for Smoky green capsicum chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo