హోమ్ / వంటకాలు / స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి

Photo of Smoky green capsicum chutney by lakshmi kumari at BetterButter
620
1
0.0(0)
0

స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి

Sep-23-2018
lakshmi kumari
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్మోకీ గ్రీన్ క్యాప్సికమ్ పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. గ్రీన్ క్యాప్సికమ్లు ......,2
  2. మినప్పప్పు...........1 టీస్పూన్
  3. ఆవాలు...............1/2టీస్పూన్
  4. మెంతులు...........1/2టీస్పూన్
  5. ఎండు మిరపకాయలు...5
  6. ఇంగువ.......చిటికెడు
  7. చింతపడు....చిన్న ఉసిరి కాయంత
  8. ఉప్పు తగినంత
  9. చిటికెడు పసుపు
  10. కొంచం కరివేపాకు
  11. అల్యుమినియం ఫాయిల్ ముక్క

సూచనలు

  1. తయారు చేయు విధానము: ముందుగా క్యాప్సికమ్ కడిగి, కొంచం నూనె రాయలి. ఫోర్క్ కి గుచ్చి గాస్ స్టవ్ మంట పైన కాల్చుకోవాలి.
  2. కాల్చిన క్యాప్సికమ్ అల్యుమినియం ఫాయిల్ లో చుట్టుకుని పక్కన పెట్టాలి.
  3. పొయ్యి మీద బాణలి ఉంచి అందులో నూనె వెయ్యాలి.
  4. నూనె వేడెక్కిన తర్వాత అందులో మినప్పప్పు, ఎండుమిర్చి వేసి, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు ఫాయిల్ లో చుట్టి పెట్టుకున్న క్యాప్సికం తీసి, గిన్నె లో నీళ్ళు పోసి క్యాప్సికమ్ వేసి చేతి వేళ్ళతో నల్లగా కాలిన తొక్కని తీసేసి, ముక్కలు చేసుకోవాలి.
  6. పోపు దినుసులు, చింతపండు, పసుపు, ఉప్పు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి, మెత్తగా పొడి అయ్యేక, క్యాప్సికమ్ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  7. మెత్తగా రుబ్బి పచ్చడిని గిన్నె లోకి తీసి, ఆవాలు, కరివేపాకు వేయించి కలుపుకుని పెట్టుకోవాలి.
  8. ఈ పచ్చడి వేడి అన్నం లో కలుపుకుని తింటే బాగుంటుంది.
  9. దోసెలలోకి కూడా వెరైటీగా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర