దొండకాయ చట్నీ | Dondakaya chutney Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dondakaya chutney recipe in Telugu,దొండకాయ చట్నీ, Rashmi SudhiMurthy
దొండకాయ చట్నీby Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About Dondakaya chutney Recipe in Telugu

దొండకాయ చట్నీ వంటకం

దొండకాయ చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dondakaya chutney Recipe in Telugu )

  • శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్
  • జీలకర 1/2 టీ స్పూన్
  • పచ్చి మిరపకాయలు 8
  • ఉల్లిపాయ 1
  • దొండకాయలు 20-30
  • పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • నూనె 2టేబుల్ స్పూన్లు
  • పసుపు చిటికెడు
  • పోపు లోకి-ఆవాలు,మినపప్పు, కరివేపాకు, ఇంగువ

దొండకాయ చట్నీ | How to make Dondakaya chutney Recipe in Telugu

  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసి అది వేడి చేసి అందులో శెనగపప్పు,జీలకర్ర వేయాలి
  2. అందులో పచ్చి మిరపకాయలు వేసి వేపాలి
  3. అవి వేగాక అందులో ఉల్లిపాయలు వేయాలి
  4. ఉల్లిపాయలు వేగాక అందులో సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు,తగినంత ఉప్పు వేసి సన్నని మంట పై ఉంచి మూత పెట్టాలి
  5. దొండకాయలు బాగా మగ్గాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
  6. అది చల్లారాక మిక్సీలో వేసి చట్నీ రుబ్బుకోవాలి
  7. చట్నీ ని ఒక బౌల్ లో తీసుకొని ఆవాలు,మినపప్పు,కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేయాలి
  8. ఈ చట్నీ దోస,చపాతీ,అన్నం లోకీబాగుంటుంది

Reviews for Dondakaya chutney Recipe in Telugu (0)