కీర దోస ముక్కల పచ్చడి. | Cucumber chutney. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cucumber chutney. recipe in Telugu,కీర దోస ముక్కల పచ్చడి., దూసి గీత
కీర దోస ముక్కల పచ్చడి.by దూసి గీత
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కీర దోస ముక్కల పచ్చడి. వంటకం

కీర దోస ముక్కల పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber chutney. Recipe in Telugu )

  • కావలిసిన పదార్థాలు :
  • కీర దోస : మీడియం సైజ్ ది 1.
  • చింతపండు :. చిన్న నిమ్మ కాయంత.
  • నువ్వుల పప్పు : 2 చెంచాలు.
  • ఉప్పు : 1/2 చెంచా.
  • పసుపు : చిటికెడు.
  • పంచదార : 1/2 చెంచా.
  • పోపుకోసం ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఇంగువ అన్నీ కలిపి 1/2 చెంచా.
  • ఎండుమిర్చి : 3
  • నూనె : 1/2 చెంచా (పోపు వేయించుకోడానికి సరిపడా)

కీర దోస ముక్కల పచ్చడి. | How to make Cucumber chutney. Recipe in Telugu

  1. చింతపండు నానపెట్టి పలుచని రసం తీసి ఉంచుకోవాలి.
  2. నువ్వులు పొడిగా వేయించి పక్కన పెట్టాలి. కీరా దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. కీరా దోసకాయ ముక్కల్లో ఉప్పు,పసుపు,పంచదార,. చింతపండు రసం వేసి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. వేయించిన నువ్వులు పప్పు పొడి చేసుకొని పచ్చడిలో కలపాలి.
  4. అన్నీ బాగా కలిసేలా కలుపుకుని, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి.
  5. చివరగా 1/4 చెంచా ఆవాలు,1 ఎండు మిరపకాయ మెత్తగా పేస్ట్ చేసి పచ్చడి లో కలపాలి.
  6. అంతే అన్నం లోకి మంచి ఆధరువైన కీరా దోస ముక్కల పచ్చడి రెడీ..
  7. ఈ పచ్చడి అటు పల్చగా కాకుండా ,ఇటు గట్టిగా ముద్దగా కాకుండా ఉంటుంది.

నా చిట్కా:

కీర దోస సగం ముక్కలు, సగం తురుము వేసుకుంటే పచ్చడి చాలా బావుంటుంది టిఫిన్స్ లో కూడా తినొచ్చు

Reviews for Cucumber chutney. Recipe in Telugu (0)