హోమ్ / వంటకాలు / కీర దోస ముక్కల పచ్చడి.

Photo of Cucumber chutney. by దూసి గీత at BetterButter
521
1
0.0(0)
0

కీర దోస ముక్కల పచ్చడి.

Sep-24-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీర దోస ముక్కల పచ్చడి. రెసిపీ గురించి

కీర దోస పచ్చిగా తినలేని వారికిమంచి సైడ్ డిష్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కావలిసిన పదార్థాలు :
  2. కీర దోస : మీడియం సైజ్ ది 1.
  3. చింతపండు :. చిన్న నిమ్మ కాయంత.
  4. నువ్వుల పప్పు : 2 చెంచాలు.
  5. ఉప్పు : 1/2 చెంచా.
  6. పసుపు : చిటికెడు.
  7. పంచదార : 1/2 చెంచా.
  8. పోపుకోసం ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఇంగువ అన్నీ కలిపి 1/2 చెంచా.
  9. ఎండుమిర్చి : 3
  10. నూనె : 1/2 చెంచా (పోపు వేయించుకోడానికి సరిపడా)

సూచనలు

  1. చింతపండు నానపెట్టి పలుచని రసం తీసి ఉంచుకోవాలి.
  2. నువ్వులు పొడిగా వేయించి పక్కన పెట్టాలి. కీరా దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. కీరా దోసకాయ ముక్కల్లో ఉప్పు,పసుపు,పంచదార,. చింతపండు రసం వేసి కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. వేయించిన నువ్వులు పప్పు పొడి చేసుకొని పచ్చడిలో కలపాలి.
  4. అన్నీ బాగా కలిసేలా కలుపుకుని, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ,ఇంగువ తో పోపు పెట్టుకోవాలి.
  5. చివరగా 1/4 చెంచా ఆవాలు,1 ఎండు మిరపకాయ మెత్తగా పేస్ట్ చేసి పచ్చడి లో కలపాలి.
  6. అంతే అన్నం లోకి మంచి ఆధరువైన కీరా దోస ముక్కల పచ్చడి రెడీ..
  7. ఈ పచ్చడి అటు పల్చగా కాకుండా ,ఇటు గట్టిగా ముద్దగా కాకుండా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర