హోమ్ / వంటకాలు / పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny)

Photo of Moongdaal chutny by Shobha.. Vrudhulla at BetterButter
322
1
0.0(0)
0

పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny)

Sep-24-2018
Shobha.. Vrudhulla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు పచ్చడి.....(moongdaal chutny) రెసిపీ గురించి

పప్పుతో చేసిన పచ్చడి కాబట్టి మంచిది చాలా రుచిగా వుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపప్పు ఒక కప్పు
  2. చింతపండు ఒక పిడికేడు
  3. ఉప్పు తగినంత
  4. ఎండు మిరపకాయలు ఐదు
  5. ఆవాలు ఒక చెంచా
  6. ఇంగువ మూడు చిటికెలు
  7. కరివేపాకు ఒకరెబ్బ
  8. నిమ్మకాయ ఒకటి
  9. నూనె మూడు చంచాలు

సూచనలు

  1. ముందుగా చింతపండు కడిగి పావుగంట పాటు నానపెట్టుకోవలెను
  2. పెసర పప్పు కూడా కడిగి రెండు నిమిషాలు ఉంచాలి
  3. ఇప్పుడు పప్పులో ఉప్పు, మిరపకాయలు వేసి నానపెట్టి ఉంచిన చింతపండు నుండి తీసుకున రసం ఈ పప్పులో వేసుకొని మెత్తగా మిక్సీ లో రుబ్బుకోవలెను.
  4. రుబ్బినప్పుడు పులుపు సరిపోయిందా లేదా అని చూసుకొని కావాలంటే మరింత రసం పోసుకొని రుబ్బుకోవాలి .
  5. రుబ్బిన పచ్చడి ఒక గిన్నెలో వేసుకోండి
  6. ఇప్పుడు ఒక చిన్న ముకుడు స్టవ్ మీద పెట్టి వేడి అయ్యాక అందులో నూనె వేసుకోండి
  7. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు , ఇంగువ , కరివేపాకు వేసి వేగనివ్వాలి.
  8. వేగిన తరువాత యి పోపుని రుబ్బిన పచ్చడిలోవేసి అందులో ఒక నిమ్మకాయని పిండుకోవాలి .
  9. పుల్ల పుల్లగా ఖారంగా ఎంతో రుచికరమయిన పెసరపప్పు పచ్చడి తయారు.
  10. అన్నాముతో తింటే చాలా రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర