హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ ఆవకాయ

Photo of CAULIFLOWER pickle by Lalitha Kandala at BetterButter
90
1
0.0(0)
0

కాలీఫ్లవర్ ఆవకాయ

Sep-24-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ ఆవకాయ రెసిపీ గురించి

కాలీఫ్లవర్ తో ఆవకాయ చాలా తేలిక మరియు రుచికరం

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక పెద్ద కాలీఫ్లవర్ లేదా 3 కప్స్ కాలీఫ్లవర్ ముక్కలు
  2. నూనె ఒక కప్
  3. 2 చెంచాలు మెంతులు
  4. 2 చెంచాలు ఆవాలు
  5. కారం రుచికి సరిపడా
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. నిమ్మకాయలు 4
  8. వెల్లుల్లి రెబ్బలు 15
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. కాలీఫ్లవర్ ను ముందుగా బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి తుడిచి ఒక గుడ్డ మీద వేసి బాగా ఆరబెట్టాలి.
  2. తడిలేకుండా బాగా ఆరిన తరువాత పాన్ లో నూనె వేసి ముక్కలను 2 లేదా 3 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టాలి.
  3. ఒక పాన్ లో మెంతులు వేసి వేయించి చల్లారాక పౌడర్ చేయాలి
  4. అలాగే ఆవాలు కూడా వేయించి పౌడర్ చెయ్యాలి.
  5. ఒక పెద్ద గిన్నెలో ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలిపి, నూనె కూడా పోసి, నిమ్మరసము వేసి బాగా కలిపి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి.
  6. కలిపిన ఆవకాయను మూత పెట్టి 24 గంటలు పక్కన పెట్టి మరునాడు బాగా కలిపి రుచి చూసి ఏమైనా తక్కువ ఉంటే కలిపి వేడి అన్నం లోకి గాని టిఫిన్ లోకి గాని తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర