బీర పొట్టు పచ్చడి | Ridgegaurd chutney Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridgegaurd chutney recipe in Telugu,బీర పొట్టు పచ్చడి, Lalitha Kandala
బీర పొట్టు పచ్చడిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బీర పొట్టు పచ్చడి వంటకం

బీర పొట్టు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridgegaurd chutney Recipe in Telugu )

  • రెండు బీరకాయల పొట్టు
  • మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి కొద్దిగా
  • చింతపండు కొద్దిగా
  • నూనె పోపుకు సరిపడా
  • పసుపు, ఉప్పు కొద్దిగా

బీర పొట్టు పచ్చడి | How to make Ridgegaurd chutney Recipe in Telugu

  1. బీరకాయలు బాగా కడిగి పొట్టు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నచ్చితే ఒక వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవచ్చు.
  3. అదే పాన్ లో ఇంకొంచం నూనె వేసి బీరపొట్టు వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మెత్తగా అయ్యాక తీసి చల్లారనివ్వండి
  4. మిక్సీలో పోపులు, బీర పొట్టు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి
  5. ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.

Reviews for Ridgegaurd chutney Recipe in Telugu (0)