టమాటో పచ్చడి (instant) | Instant tomato pickle Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Instant tomato pickle recipe in Telugu,టమాటో  పచ్చడి (instant), Sree Vaishnavi
టమాటో పచ్చడి (instant)by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

టమాటో పచ్చడి (instant) వంటకం

టమాటో పచ్చడి (instant) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant tomato pickle Recipe in Telugu )

  • 1/2 కేజీ టమాటో తరిగినవి
  • 6 చెంచాల కారం
  • 1 చెంచా పసుపు
  • 80 గ్రాములు చింతపండు
  • 1 చెంచా మెంతులు
  • 1 చెంచా ఆవాలు
  • 2 చెంచాలు నూనె
  • ఉప్పు తగినంత
  • 90 ఎం ల్ నూనె
  • కరివేపాకు 1 రెమ్మ
  • సెనగపప్పు 1 చెంచా
  • 1 చెంచా ఆవాలు
  • 2 ఎండుమిరపకాయలు
  • ఇంగువ చిటికెడు
  • జీలకర్ర 1 చెంచా

టమాటో పచ్చడి (instant) | How to make Instant tomato pickle Recipe in Telugu

  1. ముందుగా టొమాటోలు ని నీళ్లలో బాగా కడిగి ఆరబెట్టుకోవాలి
  2. ఈలోపు చింతపండుని నీళ్లలో నానబెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టోవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో ఆవాలు ,మెంతులు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  4. ఇప్పుడు ఆ రెండు చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి
  5. ఇప్పుడు మళ్ళి బాండి పెట్టి అందులో తరిగిన టమాటో ముక్కలు ఉప్పు ,పసుపు వేసి అది దెగ్గర పడే వరకు ఉంచాలి
  6. ఇప్పుడు అందులో చింతపండు రసం వేసి మరో 5-6 నిమిషాలు ఉడికించాలి
  7. ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  8. అది చల్లరిన తరువాత అందులో కారం, మెంతులు ఆవాలు పొడి వేసి బాగా కలవనివ్వాలి
  9. ఇప్పుడు స్టోవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి ,సెనగపప్పు, కరివేపాకు ,ఇంగువ వేసి వేయించాలి
  10. ఆ పోపుని పచ్చడిలో వేసుకోవాలి అంతే

Reviews for Instant tomato pickle Recipe in Telugu (0)