హోమ్ / వంటకాలు / టమాటో పచ్చడి (instant)

Photo of Instant tomato pickle by Sree Sadhu at BetterButter
576
3
0.0(0)
0

టమాటో పచ్చడి (instant)

Sep-25-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పచ్చడి (instant) రెసిపీ గురించి

టమాటో పచ్చడి పుల్లగా కారంగా మెంతి ఫలవౌర్ తో చాలా బాగుంటుంది ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది మరియు వెంటనే తినాలిఅనిపించినప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కేజీ టమాటో తరిగినవి
  2. 6 చెంచాల కారం
  3. 1 చెంచా పసుపు
  4. 80 గ్రాములు చింతపండు
  5. 1 చెంచా మెంతులు
  6. 1 చెంచా ఆవాలు
  7. 2 చెంచాలు నూనె
  8. ఉప్పు తగినంత
  9. 90 ఎం ల్ నూనె
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. సెనగపప్పు 1 చెంచా
  12. 1 చెంచా ఆవాలు
  13. 2 ఎండుమిరపకాయలు
  14. ఇంగువ చిటికెడు
  15. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా టొమాటోలు ని నీళ్లలో బాగా కడిగి ఆరబెట్టుకోవాలి
  2. ఈలోపు చింతపండుని నీళ్లలో నానబెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టోవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో ఆవాలు ,మెంతులు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  4. ఇప్పుడు ఆ రెండు చల్లారిన తరువాత పొడి చేసుకోవాలి
  5. ఇప్పుడు మళ్ళి బాండి పెట్టి అందులో తరిగిన టమాటో ముక్కలు ఉప్పు ,పసుపు వేసి అది దెగ్గర పడే వరకు ఉంచాలి
  6. ఇప్పుడు అందులో చింతపండు రసం వేసి మరో 5-6 నిమిషాలు ఉడికించాలి
  7. ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  8. అది చల్లరిన తరువాత అందులో కారం, మెంతులు ఆవాలు పొడి వేసి బాగా కలవనివ్వాలి
  9. ఇప్పుడు స్టోవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి ,సెనగపప్పు, కరివేపాకు ,ఇంగువ వేసి వేయించాలి
  10. ఆ పోపుని పచ్చడిలో వేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర